కృష్ణ

కదం తొక్కిన ఉపాధ్యాయులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జూన్ 21: ప్రభుత్వ పాఠశాలల హేతుబద్ధీకరణ, వెబ్ కౌన్సిలింగ్ విధానంపై తాడోపేడో తేల్చుకుంటామని ఉపాధ్యాయులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై గళమెత్తారు. హేతుబద్ధీకరణ, వెబ్ కౌన్సిలింగ్‌కు వ్యతిరేకంగా ఉపాధ్యాయులంతా ఒకటై జిల్లా కేంద్రం మచిలీపట్నంలో ఉప్పెనలా ఎగిసి పడ్డారు. జిల్లా నలుమూలల నుండి తరలి వచ్చిన వేలాది మంది ఉపాధ్యాయులు జిల్లా విద్యా శాఖాధికారి కార్యాలయాన్ని ముట్టడించారు. ఫ్యాప్టో, జాక్టో ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ముట్టడి తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది. డిఇఓ కార్యాలయాన్ని నాలుగు వైపులా దిగ్బంధించిన ఉపాధ్యాయులను అదుపు చేయడం పోలీసులకు కష్టసాధ్యంగా మారింది. డిఇఓ కార్యాలయ ప్రధాన ద్వారం వద్ద పోలీసులు భారీగా మోహరించినప్పటికీ ఉపాధ్యాయులను కట్టడి చేయలేకపోయారు. ఫలింతంగా స్వల్ప లాఠీఛార్జ్ చేశారు. లాఠీఛార్జ్‌ను సైతం ఉపాధ్యాయులు లెక్క చేయక పోలీసులపై తిరగబడ్డారు. పోలీసుల చేతుల్లో ఉన్న లాఠీలను లాక్కుని దూరంగా విసిరి వేశారు. ఉపాధ్యాయులను కట్టడి చేసేందుకు డిఇఓ కార్యాలయం ప్రధాన గేటు వద్ద పెద్దఎత్తున ఏర్పాటు చేసిన పోలీసుల రక్షణ కవచాలను సైతం పలుమార్లు పడేసి కార్యాలయంలోకి చొచ్చుకుపోయే ప్రయత్నం చేశారు. ఆ సందర్భాల్లో పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఉపాధ్యాయులను వెనక్కి నెట్టారు. ఈ క్రమంలో పోలీసులు, ఉపాధ్యాయుల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఉపాధ్యాయులతో పాటు పోలీసులు సైతం కింద పడిపోయి ఉక్కిరిబిక్కిరికి గురయ్యారు. పోలీసులు ఎంతగా మోహరించినప్పటికీ ఉపాధ్యాయులు ఏ మాత్రం బెదరకుండా కార్యాలయాన్ని ముట్టడించడమే లక్ష్యంగా పోలీసులపైకి దూసుకుపోయారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో బందరు డిఎస్పీ శ్రావణకుమార్ నేతృత్వంలో ఉద్యమ నాయకులతో పాటు ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేశారు. 300 నుండి 500 మంది ఉపాధ్యాయులను అరెస్టు చేసి మచిలీపట్నం టౌన్, చిలకలపూడి పోలీసు స్టేషన్‌లకు తరలించి వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. ఉపాధ్యాయుల అరెస్టుల విషయం తెలుసుకున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రభుత్వ మాజీ విప్ పేర్ని వెంకట్రామయ్య (నాని) చిలకలపూడి పోలీసుస్టేషన్‌కు చేరుకుని ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. ఉపాధ్యాయుల ఆందోళనకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. డిఇఓ కార్యాలయ ముట్టడి సందర్భంగా ఆ ప్రాంతం ఉపాధ్యాయుల నినాదాలతో మార్మోగింది. హేతుబద్ధీకరణను నిరసిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. హేతుబద్ధీకరణను తక్షణమే నిలిపి వేయాలని, ఉపాధ్యాయుల బదిలీలను కౌన్సిలింగ్ విధానంలో నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమానికి ఫ్యాక్టో జిల్లా చైర్మన్, యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబురెడ్డి నాయకత్వం వహించగా వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు మనోహర్ కుమార్, ఎ ఉమామహేశ్వరరావు, కె సంజీవరెడ్డి, కొమ్ము ప్రసాద్, చంద్రశేఖర్, శరత్ చంద్ర, సీతారామయ్య, శ్రీను, పెరుమాళ్లు, ఆర్ వరుణ కుమార్, పర్వతనేని వాసు, కె రాజేంద్ర ప్రసాద్, ఎంవిఎస్‌ఎన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.