కృష్ణ

యోగా.. మన వారసత్వ సంపద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), జూన్ 21: మానసిక ఉల్లాసంతో పాటు అనుకున్న లక్ష్యాలను సాధించడంలో యోగాను మించిన సాధనం లేదని, యోగా వలన ఎటువంటి ఫలితాలైన సాధించవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రప్రభుత్వం, ఆయుష్ శాఖల ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈకార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి యోగాసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నూజివీడు ఐఐఐటి విద్యార్థులు ప్రదర్శించిన యోగాతో గంగా ప్రక్షాళన నృత్య రూపకం అహుతులను అలరించిదని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒంగోలు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, నూజివీడులలో ఐఐఐటిలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిందని, ప్రతిభ గల మండలస్థాయి విద్యార్ధులకు ఇందులో అవకాశాలు లభిస్తాయన్నారు. నగరంలోని విఎం రంగా మున్సిపల్ కార్పోరేషన్ హైస్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన యోగాతో శివతాండవం బాగా ప్రదర్శించారని అభినందించారు. యోగా మన వారసత్వ సంపద అని ప్రపంచానికి యోగాని పరిచయం చేసింది భారతీయులని పేర్కొన్నారు. జీవితంలో ప్రతి మనిషి ఏదో ఒక మానసిక ఒత్తిడికి లోను కావడం సర్వ సాధారణమని అటువంటి ఒత్తిడిల నుండి బయట పడేందుకు యోగా ఒక దిక్సూచి అని పేర్కొన్నారు. సమస్యలను కూడా అనుకూలంగా మలచుకుంటే ఫలితాలు వస్తాయని అన్నారు. ప్రపంచానికి యోగా సంపదను ఇచ్చిన మనం దానిని ఉపయోగించుకుని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్, మంత్రులు కామినేని శ్రీనివాస్, దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, ఆయుష్ కమీషనర్ రేవతి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనురాధ, జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం, జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, మేయర్ కోనేరు శ్రీధర్, మహిళా కోఆపరేటివ్ స్టేట్ ఫైనాన్స్ చైర్‌పర్సన్ పి అనురాధ, విద్యార్థులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.