మంచి మాట

పరమాత్ముని లీలలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘సమస్య’’ అనే మూడక్షరాల సంక్షోభం. ప్రతి వ్యక్తిలో ప్రతిదినం కనిపించేది ఇది వ్యక్తిలో కలిగేది కాదు. మరో వ్యక్తి నుండి తెచ్చిపెట్టుకునేది. అది సంసారంలో కావచ్చు, సన్యాసంలో కావచ్చు, వ్యాపారం వ్యవసాయం, రాజకీయం, సినిమా రంగాలలో కావచ్చు. మరే ఇతర విషయాలలో కావచ్చు. ఈ సమస్యలతో వ్యక్తి సతమమవుతూ ఉంటాడు. తనకొచ్చిన సమస్య తనతో కాకుండా, మరో వ్యక్తితో కానీ, లేక మరికొంతమందితో పంచుకుంటాడు. సమస్య పరిస్కార మార్గం కనుగొంటాడు. ‘సమస్య’ ధర్మ మార్గమైతే పరిష్కారం సులభమవుతుంది. ‘సమస్య’లు మానవులలోనే కాదు.రాక్షసులకు, దేవతలకు కూడా ఉంటాయ. ప్రహ్లాద చరిత్రలో ప్రహ్లాదునికి కూడా సమస్యఉంటుంది. ఇది హిరణ్యకశిపుడి వధలో కనిపిస్తుంది. హిరణ్యకశిపుడు రాక్షసుడు. ప్రహ్లాదుడు అతడి కుమారుడు అయినా సాత్వికగుణం కలవాడు. ఏ సమస్యవచ్చినా, దైవాన్ని స్మరించేవాడు. దైవమే పరిష్కారం చూపుతాడని నమ్మేవాడు. కానీ తామస గుణుడైన హిరణ్యకశిపుడు తానే అధికుడినని తనకు దైవం అన్నవారు ఎవరూ లేరని అనుకొనే లక్షణం ఉన్నవాడు.
ఆకలి తీరితే మరే జంతువును చంపకపోవటం సింహతత్వం, అలాగే దుష్టులను శిక్షించటం, శిష్టులను రక్షించడం అంటే హిరణ్యకశ్యప వధ మాత్రమే నరసింహావతార తత్వం. శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాలలో నాలుగోది నృసింహావతారం. సింహరాశిలో ఉండగా, నరసింహావతారం వచ్చింది. హిరణ్యకశిపుడు కోరినట్లుగా రాత్రి పగలు కాని, సంధ్యా సమయంలో ఈ అవతారం ఆవిర్భావం జరిగి హిరణ్యకశ్యపుని వరాలకు తగినట్లుగానే ఆయన మరణం సంభవించింది ఇది దైవం యొక్కలీల. హిరణ్యకశిపుడు బ్రహ్మను, తన తపస్సుచే మెప్పించి, తనకు కావలసిన వరాలు పొందాడు, యక్షరాక్షస, కినె్నరకింపురుష, దేవ గంధర్వ సర్పాలతో, తనకు మరణం సంభవించకూడదు. వరుణ, ఇంద్ర, యమకుబేర, సూర్య చంద్ర అగ్ని వాయువు, జల, ఆకాశ రూపాల్లో దేనినైనా తన ఇష్టప్రకారం పొందగలగాలి.
ఆయుధాలు పర్వాతాలు, చెట్లు, తడిపొడిగాగల ఏ వస్తువు ద్వారానైనా, తనకు మరణం సంభవించకూడదు. పగలుగానీ, రాత్రిగానీ భూమి, ఆకాశంలో ఎక్కడైనా గానీ, ఎటువంటి ఆయుధంతోనైనా... తనకు మరణం సంభవించకూడదు. ఇంటా బయటాగానీ, ఇంటిలోపలగానీ మరణం లేకుండా వరము ఇవ్వమని బ్రహ్మను కోరాడు. బ్రహ్మ ‘తథాస్తు’ అన్నాడు. బ్రహ్మ, బోళాశంకరుడు, పరమేశ్వరుడు వరాలు ఇవ్వటంలో మొదటిమెట్టులో ఉంటారు. కాని వారు ఇచ్చిన వరాలే వారికీ, సకల లోకాలకు సమస్యలుగా మారుతాయ. ఇదంతా కూడా పరమేశ్వరుడు ఆడించేలీలావినోదమే. హిరణ్యకశిపుడు లోక కంటకుడైనాడు, దేవతలకు, మానవులకు, ఋషులకు హిఠణ్యకశ్యపుడే పెద్ద సమస్యగా మారాడు.వాని వరాలు తెలిసినవారికి వాని మరణంఅనేది విచిత్రమైన సమస్యగా అనుకొన్నారు. ఒక మహావిష్ణువుతోనే వాని పీడ విరగడ వుతుందని దానికి మహావిష్ణువే సాధ్యుడని ఆయనకే అది సాధ్యమని, బ్రహ్మాదిదేవతలు, మహేశ్వరుడు అంతా కలసి విష్ణుమూర్తిని ప్రార్థించారు. వైకుంఠునికి హిరణ్యకశిపుడి చేష్టలు, ప్రహ్లాదుని నారాయణ రక్షణ, ధర్మసంస్థాపన గురించి చెప్పారు.
శ్రీ మహావిష్ణువు, హిరణ్యకశిపుడి వరాలు, ప్రహ్లాదుని ప్రార్థనలు విన్నాడు. ఇది ఒక హిరణ్యకశిపుని మరణమే కాదు. భక్తకోటికి తన ఉనికి తె లపడం. దానికి సరియైన అవతారం నృసింహవతారమని సంకల్పించాడు ఆ భగవంతుడు. దుష్టుడైన హిరణ్యకశిపుని సంహరించి, శిష్టుడైన ప్రహ్లాదుని రక్షించిన నృసింహవతార విశిష్టత పురాణాలు తెలియజేయుచున్నవి. ఏది జరిగినా ఏమి జరిగినా ఇది అంతా పరమాత్ముని లీలావినోదమే.
‘‘పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతామ్‌
ధర్మసంస్థాపనార్దాయ, సమ్భవామి యుగే యుగే॥
భగవద్గీతలోని పరమాత్ముని బోధ మానవులకు భరోసా, ఎవరు తప్పు చేసినా, ఎవరు అధర్మం చేసినా వారికి ఇలా పరమాత్మ చేతిలో శిక్ష తప్పదు. అధర్మాన్ని కాలరాచి ధర్మాన్ని పునఃస్థాపించేవాడే పరమాత్ముడు. ఈ శిక్షించడం , రక్షించడం, దండించడం అన్నవన్నీ కూడా పరమాత్ముని లీలలే.

- జమలాపురం ప్రసాద్‌రావు