అదిలాబాద్

సింగరేణి ఐకాస ఆధ్వర్యంలో జిఎం కార్యాలయాల ముట్టడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీరాంపూర్ రూరల్, జూన్ 22: వారసత్వం ఉద్యోగాల కోసం జాతీయ కార్మిక సంఘాలు తలపెట్టిన సమ్మెలో భాగంగా గురువారం శ్రీరాంపూర్ జి ఎం కార్యలయం ముట్టిడి కార్యక్రమం చేపట్టారు. ఐదు జాతీయ కార్మిక సంఘాలు ఏ ఐటియుసి, హెచ్‌ఎంఎస్,బిఎంఎస్, సిఐటియు, ఐఎన్ టియుసి ఆద్యర్యంలోజి ఎం కార్యలయం వద్ద దర్నా నిర్వహించి అనంతరం జి ఎం ఎస్ డి ఎం సుభానీకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు సింగరేణిలో 5 జాతీయ కార్మిక సంఘాలు సమ్మె పిలుపు నివ్వగా కార్మికులు స్వచ్చంధంగా సమ్మెలో పాల్గొటుంన్నారని, టిబిజికె ఎస్ పని గట్టుకొని సమ్మె విచ్ఛిన్నం చేసేందుకు కార్మికులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. మద్యంతో క్యాంటీన్‌లను బార్లుగా మారుసప్తూన్నారని, విధులు నిర్వహించక పోతే కార్మికులకు చార్జిషిట్,సస్పేండ్, చేపిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. జాతీయ కార్మిక సంఘాలు సమ్మెను విరమించాయని కాలనీలలో మైక్‌ల ద్వార అసత్యపు ప్రచారం చేస్తున్నాయని ఇలాంటి ప్రచారం మానుకోవాలని అన్నారు. 23న డిప్యూటి సమక్షంలో జరిగే చర్చల్లోయాజమాన్యం బేషరతుగా ఎలాంటి షరతులు లేని వారసత్వ ఉద్యోగాల ఇస్తామని అగ్రిమెంట్ చేయాలని డిమాండ్ చేసారు లేని పక్షంలో 5 జాతీయ కార్మిక సంఘాల ఆద్వర్యంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏ ఐటియుసి కేంద్ర కార్యదర్శి ముస్కె సమ్మయ్య, హెచ్ ఎం ఎస్ బ్రాంచి ఉపాధ్యక్షులు పేరం రమేష్,జీవన్ జోయల్, వినయ్‌కుమార్, రాజేంద్రప్రసాద్, ఏ ఐటియుసి బ్రాంచి కార్యదర్శులు ల్యాగల శ్రీనివాస్,ర కొట్టె కిషణ్ రావు, ఎస్ కె. బాజి సైదా, ఐ ఎన్‌టియుసి నాయకులు బాబురావు, సి ఐటియు కేంద్రనాయకులు నాగరాజ్ గోపాల్,రాజశేఖర్, బి ఎం ఎస్ కేంద్ర కమిటీ సభ్యులు కాశెట్టి నాగేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

చిరుత సంచారంతో గ్రామంలో భయం భయం
ముధోల్, జూన్ 22: మండలంలోని గన్నోరా, అనుబంధ గ్రామమైన రువ్వి గ్రామ శివారులో చిరుత పులి సంచరించడంతో గ్రామంలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గత మూడు రోజు నుండి గ్రామంలోని శివారులో గత మూడు రోజుల నుండి చిరుత పులి సంచరిస్తున్న సమాచారంలో గ్రామంలో వ్యాపించడంతో గ్రామస్తులు ఆందోళనకు గురైయ్యారు. ముఖ్యంగా గ్రామానికి సమీపంలోనే పంటపోలాలు ఉండడంతో ప్రతి రోజు రైతులు పనుల నిమిత్తం వేకువ జామున వెళ్తుంటారు. కొందరు రైతులు చిరుత పులి సంచరించడాన్ని ప్రత్యక్ష్యంగా చూడడంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సమీపంలోనే పంట పోలాలు ఉండడంతో రైతులు కొట్టాలను ఏర్పాటు చేసి తమ తమ పశువులను ప్రతి రోజు కడతుంటారు. అదేవిధంగా గ్రామాల్లోని పశువులు, గొర్రెలను మెపడానికి సమీపంలోనే తీసుకెళ్తుంటారు. ప్రస్తుతం ఏ ఒక్కరు కలిసి చిరుత సంచారం గురించిన చర్చ జరుగుతుంది. పంటపోలాలకు రైతులు, కూలీలు వెళ్లడానికి భయపడుతున్నారు. దీంతో రోజు వారి వ్యవసాయ పనులపై తీవ్ర ప్రభావం పడింది. రైతులు పంటపోలాలకు వెళ్లకుండా ఇంటి దగ్గరనే ఉంటున్నారు. అదేవిధంగా పంటపోలాలకు గ్రామం సమీపంలోనే ఉండడంతో గ్రామంలోకి సహితం చిరుత వచ్చే అవకాశం ఉందని గ్రామస్తులు అంటున్నారు. చిరుత పులి దుప్పిని సహితం తినడంతో ప్రజల్లో భయం నెలకొంది. దీంతో స్థానిక సర్పంచ్ తిరుపతి రెడ్డి ఆటవీశాఖ ఆధికారులకు సమాచారం అందించారు.
గ్రామాన్ని సందర్శించిన ఆటవీశాఖ ఆధికారులు..
మండలంలోని గన్నోరా గ్రామ శివారులో చిరుత సంచరిస్తున్న విషయం స్థానిక సర్పంచ్ తిరుపతి రెడ్డి సమాచారం అందించడంతో అటవీశాఖ బీట్ ఆధికారి వసంత్ గురువారం గ్రామానికి చేరుకుని స్థానికులతో మాట్లాడారు. గ్రామ శివారులో చిరుత సంచరించిన పరిసర ప్రాంతాన్ని పరిశీలించారు. గ్రామస్తులు భయాందోళనకు గురి కావద్దని అన్నారు. గ్రామాస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పశువులను మెపడానికి వెళ్లిన సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. గ్రామాస్తులు భయపడ వద్దని అన్నారు. దుప్పిని తిన్న చిరుత పులి వారం రోజుల వారకు అహరం లేకుండా ఉంటుందని తెలిపారు. చిరుత పులి మరో ప్రాంతానికి వెళ్లె అవకాశం ఉందని పేర్కొన్నారు. చిరుత పులి కాళ్ల అనవాళ్లను సేకరించి పరిశోధనశాలకు పంపనున్నట్లు తెలిపారు. మరో సారి గ్రామ శివారులో చిరుత పులి సంచరిస్తే సి సి కెమెరాలను అమర్చి ప్రజలకు ఇబ్బందులు కలుగా కుండా తగు రక్షణ చర్యలు తీసుకుంటామని అన్నారు.

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
బెజ్జూర్, జూన్ 22: వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అధికారులు అప్రమత్తంగా ఉండాలని కుమ్రంభీం జిల్లా వైద్యాధికారి సుబ్బ రాయుడు తెలిపారు. గురువారం బెజ్జూర్ మండల పరిషత్ కార్యాలయంలో పారిశుద్ధ్యంపై అధికారులకు అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్ని మాట్లాడారు. వైద్య సిబ్బంది వ్యాధులపట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాలలో పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. వైద్యసిబ్బంది స్థానికంగా ఉండి వైద్యం అందించాలని ఆదేశించారు. గ్రామాలలో పారిశుద్యంపట్ల ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి గంగాధర్ గౌడ్, సిపివో కృష్ణయ్య, స్ర్తి, శిశు సంక్షేమ అధికారి ప్రాజెక్ట్ డైరెక్టర్ సావిత్రి, సిడిపివో వనజ, ఎడీవో తోటాజీ, తహశీల్దార్ రఫతుల్లా, డాక్టర్లు అనీల్‌కుమార్, రాజు, వైద్య సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన మంత్రి జోగు రామన్న
ఉట్నూరు, జూన్ 22: ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ఆశ్రమ ఉన్నత పాఠశాలను రాష్ట్ర అటవీ,బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని స్థితిగతులు, సౌకర్యాలపై ఆరా తీశారు. అదే విధంగా ప్రాంగణంలో చెత్తచెదారం పేరుకోవడంపై సంబంధిత ఉపాధ్యాయులు, వార్డెన్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. పేద గిరిజన విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రమ పాఠశాలలను ఏర్పాటు చేయడం జరిగిందని, క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహించడంపై మంత్రి మండిపడ్డారు. అదే విధంగా విద్యార్థుల వసతి సౌకర్యాలు, తాగునీటి ఆర్‌వో ప్లాంట్, మరుగుదొడ్లు, వంట గది, ప్రహారిగోడను పరిశీలించిన అనంతరం సౌకర్యాలు సరిగ్గా ఏర్పాటు చేయకపోవడంపై పాఠశాల సిబ్బందిని మందలించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటాలని, లేనట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అదే విధంగా విద్యార్థులతో మాట్లాడుతూ సమస్యలు ఉన్నట్లయితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకవచ్చినట్లయితే పరిష్కరిస్తారని, విద్యార్థులు మాత్రం శ్రద్దతో విద్యను అభ్యసించి ఉన్నతవంతులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. మంత్రి వెంట జడ్పీటీసీ సంగీత, సర్పంచ్ గందారి, పలువురు టీ ఆర్ ఎస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.