మహబూబ్‌నగర్

క్రీడలకు ప్రభుత్వం పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూన్ 22: క్రీడలకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని రాష్ట్ర రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటి చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. గురువారం ఒలంపిక్ అసోసియోషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రన్‌కె కార్యక్రమానికి రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటి చైర్మన్ అల్లిపూర్ వెంకటేశ్వర్‌రెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన వందలాది మంది క్రీడాకారులు, వివిధ వర్గాల ప్రజలు రన్‌కేలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ పట్టణంలో రన్‌కే సందడి నెలకొంది. పట్టణ పురవిధుల గుండా యువతి యువకులు పరుగులు తీస్తుండడం ఎంతో ఉత్సహాన్ని ఇచ్చింది. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌లు క్రీడాజ్యోతిని వెలిగించి యువతి, యువకులను ఉత్సహపరిచారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటి చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ఒలంపిక్‌డే సందర్భంగా రన్‌కేను నిర్వహించడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో క్రీడాకారులకు కొదవ లేదని అన్ని క్రీడల్లో తెలంగాణ యువత రాణిస్తున్నారన్నారు. క్రీడలను పెంపొందించడానికి గత ప్రభుత్వాలు సమైఖ్య రాష్ట్రంలో ప్రొత్సహించలేదని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇక్కడి యువతి, యువకులకు క్రీడల పట్ల మరింత ఆసక్తి కనబర్చేలా ప్రభుత్వం చేయూతనిస్తుందన్నారు. ఆంద్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి మొత్తం జిల్లాలకు కలిపి నాటి ముఖ్యమంత్రులు బడ్జెట్‌లో క్రీడలకు కేవలం రూ.50లక్షలలోపే కేటాయించి క్రీడలను చిన్నచూపు చూశారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలి బడ్జెట్‌లోనే ముఖ్యమంత్రి కెసిఆర్ రూ.100కోట్లు కేటాయించి క్రీడాకారులకు ప్రొత్సహం అందించారన్నారు. గత మూడు బడ్జెట్‌లలో కలిపి దాదాపు రూ.450కోట్లకుపైగా కేటాయించడం జరిగిందన్నారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో దాదాపు రూ.20లక్షలతో కూడిన స్టేడియం నిర్మాణాలకు ప్రభుత్వం ప్రొత్సహిస్తుందన్నారు. మండల కేంద్రాల్లో రూ.10లక్షలకుపైగా నిధులు కేటాయించి మైదానాలను ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించిందన్నారు. జిల్లా కేంద్రాల్లో రూ.కోటితో మైదానాల నిర్మాణంతో పాటు ఉన్నటువంటి మైదానాలకు మంచి హంగులను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిధులను మంజూరు చేసిందన్నారు. ప్రతి పాఠశాలలో విద్యార్థులను క్రీడలవైపు మళ్లించడానికి పాఠశాలల్లో కూడా క్రీడలకు ప్రత్యేక చేయూతను ఇస్తున్నామన్నారు. తాను మహబూబ్‌నగర్ జిల్లా వాసినే కాబట్టి జిల్లాలో క్రీడాకారుల ప్రొత్సహం కోసం ప్రత్యేక చొరవ చూపుతానని తెలిపారు. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ పాలమూరు జిల్లాలో క్రీడలను మరింత ప్రొత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. మహబూబ్‌నగర్ పట్టణంలో ప్రస్తుతం ఉన్న మైదానం సరిపోవడం లేనందున మరో మైదానం ఎంతో అవసరం ఉందని అన్ని క్రీడలకు ఇలాంటి చిన్న మైదానంలో క్రీడాకారులు శిక్షణ పొందాలంటే ఇబ్బందికరంగా మారిందన్నారు. తాను ప్రత్యేకంగా చొరవ తీసుకుని మరో మైదానం నిర్మాణానికి కృషి చేస్తానని అందుకు కావల్సిన భూమిని కూడా పెద్ద చెరువు మినీ ట్యాంక్‌బండ్ దగ్గర ఆరెకరాల భూమిని ఇప్పటికే కేటాయించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరు క్రీడలను ప్రొత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రాధ ఆమర్, జిల్లా క్రీడలను అధికారిణి సత్యవాణి, ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు.