మహబూబ్‌నగర్

రైతన్నపై జీఎస్టీ పిడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూన్ 22: కేంద్ర ప్రభుత్వం వచ్చే నెల 1వ తేది నుండి దేశవ్యాప్తంగా ఆమలులోకి తీసుకురానున్న వస్తుసేవా పన్ను (జీఎస్టీ) రైతాంగానికి పెనుభారంగా మారనుంది. ప్రస్తుతం ఉన్న ఎరువుల ధరలు ఆమాంతంగా పెరిగే అవకాశం ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ఎరువుల ధర భారానే్న మోసేందుకు రైతులు సతమతమవుతుండగా కొత్తగా ఆమలు చేస్తున్న జీఎస్టీలో మరింత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎరువులపై ఒకశాతం ఎక్సైజ్ సుంకం, 5శాతం వ్యాట్ వసూలు చేస్తున్నారు. మొత్తం మీద ఆరుశాతం పన్ను పడుతుంది. ఇక జీఎస్టీ ఆమలులోకి వస్తే 12శాతం చెల్లించాల్సి ఉంటుంది. దాంతో మహబూబ్‌నగర్ జిల్లాలో జీఎస్టీ వల్ల రైతులకు ఏటా సుమారు రూ.100కోట్ల వరకు అదనపు భారం పడనుంది. వచ్చే ఏడాది ఖరీఫ్ నుంచి సాగు ఖర్చుల కోసం ఎకరాకు రూ.4వేలు ఇవ్వనున్నట్లురాష్ట్ర ప్రభుత్వం ఇటివల ప్రకటించడంతో సంతోషించిన రైతాంగానికి జీఎస్టీ బిల్లు వారి నడ్డి విరిచేలా మారిందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఒక దేశం ఒకే పన్ను విధానం పేరుతో కేంద్ర ప్రభుత్వం జూలై 1వ తేది నుండి దేశవ్యాప్తంగా ఆమలులోకి తీసుకువస్తున్న వస్తుసేవల పన్ను కొన్ని వర్గాలకు మేలు చేస్తుండగా దేశానికి వెన్నుముక అయిన రైతాంగానికి మాత్రం నష్టం చేకూరుస్తుంది. పరోక్ష పన్నుల విషయంలో దేశవ్యాప్తంగా ఒకే విధానం ఆమలు చేసేందుకు కేంద్రం జీఎస్టీని ఆమలులోకి తెస్తున్న విషయం తెలిసిందే. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తీసుకుంటున్న నిర్ణయం ప్రజలకు మేలు చేస్తుందని ప్రభుత్వం చెబుతుంది. అయితే కొన్ని వర్గాలకు మేలు చేస్తున్నప్పటికిని అన్నం పెట్టే రైతుకు మాత్రం పెనుభారం మోపనుంది. ఇప్పుడున్న ఎరువుల ధర భారానికే సతమతమవుతున్న రైతాంగానికి కొత్తగా ఆమలు చేస్తున్న జీఎస్టీతో వారిపై మరింత భారం పడనుంది. ఇక జీఎస్టీ ఆమలులోకి వస్తే 12శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఎరువులను కేంద్రం 12శాతం జీఎస్టీ శ్లాబ్‌లోకి చేర్చింది. దిని ప్రకారం 12శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దిని ఫలితంగా యూరియాకు బస్తాకు రూ.36, డిఏపికి రూ.120, 20-20కాంప్లెక్స్ ఎరువులకు రూ.106, పోటాష్ రూ.70చోప్పున ధర పెరగనుంది.
సేంద్రియ ఎరువులకు పన్నుపోటు
ఇప్పటి వరకు సేంద్రియ ఎరువులు, బయోఫర్టిలైజర్‌పై ఎలాంటి పన్ను లేదు. అయితే తాజాగా ఇప్పుడు వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. దింతో వీటి ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడే సేంద్రియ వ్యవసాయానికి రైతులు ఎక్కువ మొగ్గు చూపుతున్న నేపథ్యంలో ఒకవిధంగా చెప్పాలంటే రైతులకు ఇది ఇబ్బందికర పరిస్థితి అని చెప్పుకోవాలి.
ఏ ఏ వస్తువులకు ఎంతెంత...?
జీఎస్టీల వల్ల 81 వస్తువుల ధరలకు 18శాతంలోపు పన్ను ఉంటుందని కేంద్రం చెబుతుంది. లిక్కర్, పెట్రోల్‌కు సంబందించిన పన్నులను జీఎస్టీలో చేర్చలేదు. వీటిని రాష్ట్రాల పరిధిలో ఉంచారు. లగ్జరి వస్తువులు, సంబందిత ఉత్పత్తులపై జీఎస్టీతో పాటు 15శాతం సెస్ విధించారు. దింతో వీటికి సంబందించిన గరిష్టంగా 43శాతం పన్ను వసూలు చేస్తారు. కంజూమర్ ఎలక్ట్రానిక్ ధరలు 3శాతం నుండి 5శాతం పెరుగుతాయి. వీటిపై ప్రస్తుతం 23శాతం పన్ను ఉండగా ఇకమీదట 28శాతం వసూలు చేస్తారు. అయితే ప్యాక్ చేయని ఆహర దాన్యాలు, బెల్లం, పాలు,గుడ్లు, పెరుగు, లస్సీ, ప్యాక్ చేయని పన్నీర్, బ్రాండెడ్ కానీ సహజ తెనె, తాజా కూరగాయాలు, బ్రాండెడ్ కానీ గొదుమపిండి, మైదా, శెనగపిండితో పాటు ప్రసాదం, తాటిబెల్లం, ఉప్పు, కాటుక, చిపురుకట్ట, పిల్లల డ్రాయింగ్, కలరింగ్ పుస్తకాలు, విద్యాసేవలు, ఆరోగ్యసేవలపై పన్ను లేదు. ఏది ఎమైనప్పటికిని జీఎస్టీతో మాత్రం రైతులకు పెనుభారమే పడుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే అప్పుల ఊబిలో కురుకుని ఆత్మహత్యల పాలు అవుతున్న రైతాంగానికి జీఎస్టీ పిడుగులాంటిదేనని రైతాంగం ఆందోళన చెందుతున్నారు.