మహబూబ్‌నగర్

మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూన్ 22: ముస్లీం మైనారిటీల సంక్షేమం కోసం ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ కట్టుబడి ఉందని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. గురువారం సాయంత్రం హన్వాడ మండల కేంద్రంలో ప్రభుత్వపరంగా రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఇచ్చిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ముఖ్యఅతిథిగా హజరయ్యారు. అదేవిధంగా పేద ముస్లీం కుటుంబాలకు దుస్తువులను పంపిణీచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ హన్వాడ మండలంలోని ముస్లీంలు పేదరికంలో మగ్గుతున్నారు. ఇలాంటి వారి అభివృద్ధి కోసం ప్రభుత్వం చేయూతను ఇస్తుందన్నారు. పేద ముస్లీంలా ఆడపిల్లల పెళ్లిళ్లకు షాదిముబారక్ పథకం ద్వారా రూ.71వేలను ప్రభుత్వం అందిస్తుందని ఈ పథకాన్ని ప్రతి ఆడబిడ్డ ఉన్న ముస్లీంలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పెళ్లికి ముందే పెళ్లి కార్డును తహశీల్దార్ వద్ద దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. హన్వాడ మండలంలోని అన్ని గ్రామాల్లో గల పేద ముస్లీంలు అందరికి రంజాన్ పండుగను పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం బట్టలను పంపిణీ చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత మంచి నిర్ణయం తీసుకుందని మహబూబ్‌నగర్‌లో మైనారిటీ గురుకుల పాఠశాలలను కూడా ప్రారంబించడం జరిగిందన్నారు. అందులో హన్వాడ మండలానికి సంబందించిన పేద ముస్లీంలా పిల్లలందరిని మైనారిటీ గురుకుల పాఠశాలల్లో చెర్పించాలని సూచించారు. గంగాజమున తరహలో తెలంగాణ ప్రజానికం బతుకుతున్నారని తెలిపారు. అంతేకాకుండా హన్వాడ మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని అందులో భాగంగా ఇప్పటికే అన్ని గ్రామాలకు బిటిరోడ్డు సౌకర్యం చేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా మరో మూడునాలుగు రోజుల్లో మిషన్‌భగీరథ పథకం ద్వారా నియోజకవర్గంలోని 40గ్రామాలకు ఇంటింటి నల్లా పథకానికి శ్రీకారం చుట్టబోతున్నామని ఎమ్మెల్యే వెల్లడించారు. అంతేకాకుండా మరో మూడేళ్లల్లో ఎట్టి పరిస్థితుల్లో హన్వాడ మండలానికి తాగునీరు అందించి తీరుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో హన్వాడ తహశీల్దార్ జ్యోతి, గ్రామ సర్పంచు వెంకటమ్మ, ఎంపిటిసిలు రాధ, ఆంజనేయులు, ఉప సర్పంచులు అంజద్ హుస్సెన్, టిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి కృష్ణయ్యగౌడ్, ఇమామ్‌లు, వౌజాలు, తెరాస నాయకులు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.