మహబూబ్‌నగర్

ముస్లింల అభ్యున్నతికి సిఎం కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాన్‌గల్, జూన్ 22: ముస్లీంల అభ్యున్నతికి సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర పంచాయతి రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని తహశీల్ కార్యాలయంలో ముస్లీం సోదరులకు దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టిఆర్‌ఎస్ ప్రభుత్వాలు కుల మతాలకు అతీతంగా పని చేస్తుందని, ముస్లీంల సంక్షేమం కోసం ప్రభుత్వం పెద్దపీఠ వేస్తుందన్నారు. టిఆర్‌ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు పేద ప్రజలకు అందించడం జరుగుతుందన్నారు. 60 ఏళ్లలో జరగని అభివృద్ధి కేవలం మూడు సంవత్సరాల్లోనే అభివృద్ధి చేసి చూపించిన ఘనత టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి సిఎం కెసిఆర్‌కే దక్కిందన్నారు. ప్రజారైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన అన్నారు. రంజాన్ పండుగను ముస్లీం సోదరులు శాంతియుతంగా సంతోషంగా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం ముస్లీం సోదరులకు దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి వెంకటేష్‌నాయుడు, జడ్పిటిసి రవికుమార్, సింగిల్‌విండో వైస్ ఛైర్మన్ భాస్కర్ యాదవ్, తహశీల్ధార్ ఆలెగ్జాండర్, ఎంపిడిఓ ఆంజనేయులు, నియోజకవర్గ ప్రత్యేక అధికారి కృష్ణయ్య, సర్పంచులు సురేఖ రాముయాదవ్, కృష్ణ యాదవ్, ఎంపిటిసిలు రాంచందర్ యాదవ్, వెంకటమ్మ, కిరణ్‌కుమార్‌గౌడ్, కో-ఆప్షన్ యూనుస్‌ఖాన్, నాయకులు గోవర్ధన్‌సాగర్, సుదర్శన్‌రెడ్డి, వీరసాగర్, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.