నల్గొండ

పల్లెల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెన్‌పహాడ్, జూన్ 22: పల్లెల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని విద్యుత్, దళిత అభివృద్ది శాఖల మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని మహ్మాదాపురం, సింగారెడ్డిపాలెం, అనంతారం, పొట్లపహాడ్, మాచారం, దూపహాడ్ గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశాల్లో మాట్లాడుతూ గత పాలకుల వల్ల తెలంగాణ రాష్ట్రం 60 సంవత్సరాల వెనుకబాటుకు గురైందన్నారు. పల్లెల అభివృద్దితోనే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందన్నారు. ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలనే కాకుండా మ్యానిఫెస్టోలో ఇవ్వని హామీలను సైతం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్నో సంక్షేమ పథకాలు అమలుచేసి దేశంలోనే నెంబర్-1 రాష్ట్రంగా అభివృద్ధి చేశారన్నారు. రైతుల కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి కాబట్టి కెసిఆర్ రైతుల పంటల సాగుకు ఎకరాకు రూ.4వేలు అందిస్తుందన్నారు. విద్యార్థుల చదువుకోసం గురుకులాలు, వారికి నాణ్యమైన భోజనం, ఆడ పిల్లలకు వివాహాలకు కళ్యాణలక్ష్మి, వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్‌లు అందిస్తుందన్నారు. అనంతరం నాగులపాటి అన్నారం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇండియన్ పెట్రోల్ బంక్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి సభ్యుడు ఒంటెద్దు నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వై.వెంకటేశ్వర్లు, ఎంపిపి భూక్య పద్మ, జడ్పీటిసి పినె్నని కోటేశ్వర్‌రావు, నాయకులు కట్కూరి గన్నారెడ్డి, బడుగుల లింగయ్యయాదవ్, తహశీల్దార్ యాదాబాయి, ఎంపిడివో అలివేలు మంగమ్మ, మండల టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు మిర్యాల వెంకటేశ్వర్లు, నెమ్మాది భిక్షం, మండారి నాగేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు వెన్న సీతారాంరెడ్డి, మురళీ, శ్రీనివాస్, జూలకంటి వెంకట్‌రెడ్డి, గార్లపాటి స్వర్ణ శ్రీనివాస్‌రెడ్డి, మామిడి సైదులు పాల్గొన్నారు.
గుండెపోటుతో టిఆర్‌ఎస్ కార్యకర్త మృతి
మండలంలో గురువారం మంత్రి జగదీశ్‌రెడ్డి పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. అనంతారం గ్రామంలో మంత్రి పర్యటన సందర్భంగా ర్యాలీ నిర్వహిస్తుండగా గ్రామానికి చెందిన టిఆర్‌ఎస్ కార్యకర్త షేక్ జానీమియా(55) ర్యాలీలో పాల్గొని గుండెపోటుతో మృతిచెందాడు. విషయం తెలిసిన వెంటనే మంత్రి జానీమియా మృతదేహాన్ని సందర్శించి నివాళ్లర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. జానీమియా దహన సంస్కారాల కోసం రూ.10వేలు అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి రూ.లక్ష వచ్చే విధంగా చూస్తానన్నారు. జానీమియా కుటుంబాన్ని అన్ని విధాలుగా టిఆర్‌ఎస్ పార్టీ ఆదుకొని అండగా ఉంటుందన్నారు.