నల్గొండ

నిర్వాసితులను ఆదుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూన్ 22: నార్కట్‌పల్లి-అద్దంకి రహదారి వెంట గ్రామాల వద్ద నిర్మించాల్సిన సర్వీస్ రోడ్ల ప్రాంతాలను కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ గురువారం పరిశీలించారు. నార్కట్‌పల్లి-అద్దంకి రహదారి వెంట ఉన్న గ్రామాలు ఎల్లారెడ్డిగూడెం, చర్లపల్లి, మర్రిగూడ బైపాస్, దుప్పలపల్లిల వద్ద సర్వీస్ రోడ్ల నిర్మాణ స్థలాలను, భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు సర్వీస్ రోడ్ల నిర్మాణాలు జరిగితే తమ స్థలాలు, దుకాణాలు, ఇళ్లు, భూములు కోల్పోతున్న తీరును, వారి సమస్యలను కలెక్టర్‌కు వివరించి తమకు న్యాయం చేయాలని కోరారు. సర్వీస్ రోడ్ల నిర్మాణం తప్పనిసరిగా జరగాల్సివుందని, ఇందుకు భూసేకరణ తప్పదన్నారు. భూసేకరణలో భాగంగా భూములు, ఇళ్లు, దుకాణాలు కోల్పోయేవారికి ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల కంటే మూడు రెట్లు అదనంగా నష్ట పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నిర్వాసితుల డిమాండ్లను సానుకూలంగా పరిశీలించి తగిన న్యాయం చేస్తామని భరోసానిచ్చారు. సర్వీస్ రోడ్ల నిర్మాణానికి వెంటనే భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేసి భూముల స్వాధీనానికి నోటీస్‌లు అందించాలి పనులు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ సి.నారయణరెడ్డి, ఆర్డీవో వెంకటాచారి, సర్వే ల్యాండ్ రికార్డు ఏడి శ్రీనివాసులు, తహశీల్దార్ వినయ్‌కుమార్, ఆర్‌అండ్‌బి అధికారులు ఉన్నారు.