నిజామాబాద్

కామ్రేడ్ కనె్నగంటి మృతదేహం మెడికల్ కళాశాలకు అప్పగింత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినాయక్‌నగర్, జూన్ 22: ప్రముఖ కవి, రచయిత, కమ్యునిష్టు ఉద్యమ నేత కామ్రేడ్ కనె్నగంటి నరసింహరావు గురువారం తుది శ్వాస విడువగా, ఆయన పార్థీవ దేహాన్ని మెడికల్ కళాశాలకు అప్పగించారు. ముందుగా కనె్నగంటి నరసింహ పార్థీవ దేహాన్ని నగరంలోని ఎన్‌ఆర్.్భవన్‌లో ఉంచిన పౌర హక్కుల నేతలు, కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మానవ హక్కుల రాష్ట్ర నాయకుడు గొర్రెపాటి మాధవరావు మాట్లాడుతూ, అనేక సామాజిక రచనలతో ప్రజలను చైతన్యపర్చిన కనె్నగంటి మృతి ప్రజా ఉద్యమానికి తీరని లోటన్నారు. సామాజిక అసమానతలు, దోపిడీ నిర్మూలనకు, కమ్యునిస్టు ఉద్యమానికి కనె్నగంటి నరసింహరావు చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన చివరి కోరిక మేరకు కనె్నగంటి పార్థీవ దేహాన్ని మెడికల్ కళాశాలకు అప్పగించడం జరుగుతుందన్నారు. గురువారం మధ్యాహ్నం సమయంలో కనె్నగంటి పార్థీవ దేహాన్ని మెడికల్ కళాశాల వరకు ఊరేగింపుగా తీసుకెళ్లి కళాశాల నిర్వాహకులకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో న్యూడెమోక్రసీ నాయకులు వేల్పూర్ భూమయ్య, రవికుమార్, సత్తెక్క, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.