నిజామాబాద్

కార్మిక విధానాలను నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినాయక్‌నగర్, జూన్ 22: ఎన్నికల్లో ఇచ్చిన హామీను తుంగలో తొక్కుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా భారతీయ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు మల్లేశం మాట్లాడుతూ, కేంద్ర, రాషట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మజ్దూర్ సంఘం కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు కలెక్టరేట్ల ఎదుట రెండు రోజుల పాటు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. ఇందులో భాగంగానే శుక్రవారం కార్మికులతో భారీ ర్యాలీ చేపట్టి, కలెక్టరేట్‌ను ముట్టడించడం జరుగుతుందన్నారు. పాలకుల నిర్లక్ష్యం వల్ల గడిచిన 3సంవత్సరాల వ్యవధిలో సమారు 5వేల పరిశ్రమలు మూతబడ్డాయని ఆరపించారు. ముఖ్యంగా బోధన్‌లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీ, సిర్పూర్ కాగజ్‌నగర్ ఫ్యాక్టరీలు మూతపడటంతో వేలాది కుటుంబాలు ఉపాధి అవకాశాలను కోల్పోయి రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న లక్షలాది మంది కార్మికులు సమాన పనికి సమాన వేతనం లభించకా, వెట్టిచాకిరి చేస్తున్నారని అన్నారు. అందువల్ల కార్మికులు, ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ఆందోళనలో మజ్దూర్ సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.