ఖమ్మం

సమ్మెపై కుయుక్తులు మానాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, జూన్ 22: సింగరేణి యాజమాన్యం సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట గురువారం ఆందోళన నిర్వహించారు. యాజమాన్యానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బొగ్గుగనులు, ఓపెన్‌కాస్ట్‌ల వద్ద ఉన్న పోలీసు బలగాలను వెనక్కి పంపాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కొత్తగూడెం మాజీ శాసన సభ్యుడు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా వారసత్వ ఉద్యోగాల సాధన కోసం కార్మికులు ఎనిమిది రోజులుగా సమ్మె నిర్వహిస్తుంటే కోల్ బెల్ట్ ఏరియాలోని ప్రజా ప్రతినిధులు స్పందించటం లేదని ఆరోపించారు. హక్కుల సాధన కోసం శాంతియుతంగా సమ్మె నిర్వహిస్తున్న కార్మిక సంఘాల నాయకులను ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని ఆరోపించారు. వేలాది మంది కార్మికులు సమ్మె నిర్వహిస్తుంటే సింగరేణి యాజమాన్యం సింగరేణిలో సమ్మె లేదని బొగ్గు ఉత్పత్తి అధికంగా అవుతుందని చేస్తున్న ప్రకటనలపై మండిపడ్డారు. ప్రతిపక్షాలు, కార్మిక సంఘాలపై పోలీసులు పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ కార్మిక సంఘాల నాయకులు మంద నర్శింహారావు, దమ్మాలపాటి శేషయ్య, వంగా వెంకట్, గుత్తుల సత్యనారాయణ, ఇస్మాయిల్, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కె సాబీర్‌పాషా, వెంకటస్వామి, నాగభూషణ, బివి రమణారావు, ఎవి రామారావు తదితరులు పాల్గొన్నారు.