ఖమ్మం

అభివృద్ధి, సామాజిక న్యాయం కోసం విశాల ప్రజా ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం (కల్చరల్), జూన్ 22: మహాజన పాదయాత్రలో వచ్చిన సమస్యల పరిష్కారం కోసం చేసే పోరాటానికి విశాల ప్రజా ఉద్యమం నిర్మిస్తామని, మహాజన పాదయాత్ర సారధి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ఇప్పటికే రెండు వందలకు పైగా వామపక్ష ప్రజాసంఘాలు, ప్రజా తంత్రవాదులు, మేధావులు ముందుకు వచ్చారని దానికి కార్యాచరణ ప్రణాళిక తయారౌతుందన్నారు. తెలంగాణ రైతాంగ పోరాట యోధుడు, తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య వర్ధంతిని జూలై 4న హైదరాబాద్‌లో తెలంగాణ ప్రజాభవన్‌లో అవిర్భవిస్తుందన్నారు. గురువారం యర్రా శ్రీకాంత్ అధ్యక్షతన స్ధానిక సుందరయ్యభవన్‌లో జరిగిన సిపియం జిల్లా కమిటీ సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ప్రసంగించారు. సుధీర్ఘమైన మహాజన పాదయాత్ర కెసిఆర్ ప్రభుత్వ ఎజెండాను మార్చిందన్నారు. సామాజిక సమస్యలపై వాగ్దానాల వర్షం కురిపిస్తున్నాడని, ఆచరణలో మాత్రం అడుగుముందుకు సాగడం లేదని ఎద్దేవచేశారు. తాత్కాలిక పథకాలతో గొర్రెలు, చేపలతో వెనుకబడిన వర్గాలకు ఒరిగేదేముందన్నారు. కుల వివక్ష, పరవు హత్యలు పెరిగిపోతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. రాష్ట్రంలోనే అతిపెద్ద కుంభకోణం మియాపూర్ భూకుంభకోణం అన్నారు. దానిని మరిపించడానికే గొర్రెల పంపకాన్ని ఆడంబరంగా జరుపుతున్నారని ఆయన విమర్శించారు. పేరుకు ధనిక రాష్టమ్రైనా అప్పుల్లో దేశంలోనే తెలంగాణ మొదటి స్ధానంలో నిలిచిందన్నారు. గ్రూపు-2 ఉద్యోగాలను అమ్ముకున్నారని, వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలన్నారు. మిర్చి రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రైతులను దళారులు దోచుకుంటుంటే, పంటల ధరలు పడిపోతుంటే స్పందించలేని ప్రభుత్వం 4 వేల ఎరువుల సబ్సిడీ గురించి మాట్లాడడం రైతులను మభ్యపెటట్డమేనన్నారు. ఈ సామావేశంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్‌రావు, జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు, రాట్ర కమిటి సభ్యులు నున్నా నాగేశ్వరరావు, బుగ్గవీటి సరళ, జిల్లా కార్యదర్వివర్గ సభ్యులు కల్యాణం వెంకటేశ్వరరావు, బత్తుల లెనిన్, జిల్లా కమిటి సభ్యులు తాతా భాస్కర్‌రావు, మాచర్ల భారతి, బారి మల్సూర్, నందిపాటి మనోహర్ తదితరులు పాల్గొన్నారు.