ఖమ్మం

అన్నం పెట్టే రైతును కాపాడుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధిర, జూన్ 22: దేశానికి అన్నం పెట్టే రైతును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది అని వైరా ఎసిపి ఎం శ్రీ్ధర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మధిర సిర్కిల్ పరిధిలోని 3మండలాల విత్తనాల డీలర్లు, ఎరువులు, పురుగుమందుల వ్యాపారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపారులు అత్యాశతో అమ్ముతున్న నకిలీ విత్తనాల కారణంగా వేలాది రూపాయలు ఖర్చుచేసి వేసిన పంటలు చేతికిరాక రైతులు తీవ్రంగ నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వ గుర్తింపు పొందిన కంపెనీల విత్తనాలను మాత్రమే అమ్మకాలు చేయాలన్నారు. రైతు సంక్షేమమే, ప్రభుత్వ సంక్షేమం అనేలా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలన్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన విత్తన కంపెనీల వివరాలను తమ దుకాణాల వద్ద బోర్డు పై ఉంచాలన్నారు. విత్తనాల కంపేనీల గురించి మైక్‌ల ద్వారా ప్రచారం చేయకూడదన్నారు. అలా చేస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. విత్తనాలు కొన్న రైతులకు వ్యాపారులు విధిగా బిల్లులు ఇవ్వాలని అందువలన విత్తనాల వలన రైతులకు నష్టం జరిగిన వ్యాపారులపై కేసులు నమోదు చేయకుండా విత్తన తయారీ కంపెనీలపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. సమావేశంలో మధిర, వైరా సిఐలు శ్రీ్ధర్, మల్లయ్యస్వామి, టౌన్ ఎస్‌ఐ బి తిరుపతిరెడ్డి, మూడు మండలాల విత్తన, ఎరువులు పురుగుమందుల వ్యాపారులు పాల్గొన్నారు.