విజయవాడ

భవిష్యత్ తరాలకూ సరిపడేలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), జూన్ 22: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగరంలో ప్రపంచ శ్రేణి పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు సిస్టమ్ అమలుకు ప్రణాళికలు సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని ఎపి సిఆర్‌డిఎ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్, ఎపిఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ మాలకొండయ్య అన్నారు. ట్రాఫిక్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌పై గురువారం నగరంలోని సిఆర్‌డిఏ కార్యాలయంలో వీరు అధికారులతో సమీక్షించిన అనంతరం ప్రస్తుత అవసరాలే కాకుండా భవిష్యత్తు అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌ను రూపొందించాలన్నారు. సిస్టమ్ రూపకల్పనలో ప్రపంచ శ్రేణి నగరాలు, రాజధాని నగరాలలో అమలుతున్న విధానాలే కాకుండా అంతకన్నా మెరుగైన విధానాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. బస్ టెర్మినల్, బస్ డిపోలు, సిటీ ఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్, బస్ షెల్టర్ల డిజైన్లు, బస్‌ల వివరాలు తెలిపే చార్ట్‌బోర్డుల ఏర్పాటు, డిజిటల్ సర్వీసెస్, తదితర అంశాలపై చర్చించిన అనంతరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాజధాని మాస్టర్ ప్లాన్ పరిశీలించిన ఆర్టీసి ఎండి మాల కొండయ్య ఆర్టీసి అవసరాలను కమిషనర్ శ్రీ్ధర్‌కు వివరించారు. ఈ సమావేశంలో సిఆర్‌డిఎ ట్రాఫిక్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రిన్సిపల్ ప్లానర్ ఎన్‌ఆర్ అరవింద్, తదితరులు పాల్గొన్నారు.