విజయవాడ

రైల్వే బైపాస్ కోసం భూముల పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ రూరల్, జూన్ 22: రైల్వే బైపాస్ కోసం గ్రామాల్లోని పరిస్థితుల్ని వివిధ ప్రభుత్వ శాఖాధికారులు గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విజయవాడ గ్రామీణ మండలంలోని గొల్లపూడి, రాయనపాడు, జక్కంపూడి గ్రామాల్లోని భూముల్ని రైల్వే, ఇరిగేషన్, రెవెన్యూ, వ్యవసాయ ఇతర అధికారులతో కలిసి సబ్ కలెక్టర్ హరీష్ పరిశీలించారు. ప్రస్తుతం ప్రతిపాదించే ప్లాన్ ప్రకారం గొల్లపూడి, రాయనపాడు, జక్కంపూడి గ్రామాల్లో 70 ఎకరాలకు పైగా భూమిని సేకరించాల్సి వస్తుందని అధికారులు చర్చించుకుటున్నారు. సికింద్రాబాద్-విశాఖపట్నం రైల్వేలైనుకు సంబంధించి రాజధాని అమరావతిని దృష్టిలో ఉంచుకొని రైల్వే బైపాస్‌కు ప్రభుత్వం ప్రతిపాదనలు చేస్తోంది. ఈసందర్భంగా ప్రాథమికంగా క్షేత్రస్థాయిలో భూమిని సేకరించే అంశాల్ని పరిశీలిస్తున్నారు. తహశీల్దార్ మదన్‌మోహన్, విఆర్ వో చందు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.