విజయవాడ

దుర్గగుడి ట్రస్ట్‌బోర్డులో పెరగనున్న సభ్యుల సంఖ్య?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, జూన్ 22: శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానానికి ట్రస్ట్ బోర్డుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు గురువారం ఉదయం నుండి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ముగ్గురు బిజెపి నేతలు దుర్గగుడి ట్రస్ట్‌కు బోర్డు సభ్యులుగా దరఖాస్తులు చేసుకున్నారు. కాగా బుధవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల్లో కేవలం బిజెపికి చెందిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు అత్యంత సన్నిహితుడైన వీరమాచినేని రంగ ప్రసాద్ మాత్రమే జాబితాలో ఉన్నారు. మిగత ఇద్దరు నేతల పేర్లు జాబితాలో లేకపోవటంతో వారు టిడిపిపై గుర్రుగా ఉన్నారు. ఎప్పటి నుండో ట్రస్ట్ బోర్డులో తమను నియమించాలని బిజెపి డిమాండ్ చేస్తోంది. గతంలో కూడా బిజెపి నేతల పేర్లు లేకుండా కేవలం టిడిపికి చెందిన నేతల పేర్లు మాత్రమే దేవాదాయ శాఖకు పంపారు. బిజెపి నేతల డిమాండ్ నేపథ్యంలో తాజాగా బిజెపి నేతల పేర్లతో ఉన్న జాబితాను కూడా పంపారు. చివరకు బుధవారం ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ విడుదల చేసిన ఉత్తర్వుల్లో బిజెపికి చెందిన రంగ ప్రసాద్ ఒక్కరే ఉన్నారు. దీనిపై బిజెపి నేతలు ఇప్పటికే మంత్రి మాణిక్యాలరావును ప్రశ్నించినట్లు తెలిసింది. ఆయన విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి మరో నలుగురుకి అవకాశం ఇప్పించేలా చర్యలు తీసుకుంటానని ఆ నేతలకు హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేస్తూ వచ్చిన ప్రభుత్వం చివరకు చైర్మన్ లేకుండానే ట్రస్ట్‌బోర్డును నియమిస్తూ ఉత్తర్వులను అటు సభ్యులకు ఇటు దుర్గగుడి కార్యాలయానికి పంపారు. గతంలోనూ మొదటి జాబితానే కాకుండా రెండో జాబితాలో మరికొంత మందికి అవకాశం ఇచ్చి విడుదల చేసిన సంఘటనలు దుర్గగుడిలో జరిగాయి.