కృష్ణ

దేవినేని నెహ్రూ విగ్రహావిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, జూన్ 22: దివంగత దేవినేని నెహ్రూ 63వ జయంతి సందర్భంగా గుణదల 3 వంతెనల సెంటర్‌లో ఏర్పాటు చేసిన మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నాయకుడు స్వర్గీయ దేవినేని రాజశేఖర్ (నెహ్రూ) విగ్రహాన్ని గురువారం సాయంత్రం వేలాది మంది పార్టీ శ్రేణులు, అభిమానుల మధ్య దివంగత నెహ్రూ బాబాయ, జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తండ్రి దేవినేని శ్రీమన్నారాయణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి దేవినేని ఉమా, నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్, తదితరులు నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈసందర్భంగా మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ స్వర్గీయ దేవినేని రాజశేఖర్ లేనిలోటు ఎవరూ భర్తీ చేయలేరన్నారు. ఆయన ఏ పార్టీలో ఉన్నా ఒక లక్ష్యంతో పనిచేసే వారన్నారు. టిడిపి ఆవిర్భావం నుంచి నెహ్రూ టిడిపిలో క్రియాశీలకంగా పనిచేశారన్నారు. అవినాష్ రాజకీయ అభివృద్ధికి పార్టీలో ఉన్నవారంతా మనస్ఫూర్తిగా కృషి చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి దేవినేని అవినాష్‌కు పార్టీలో ఉన్నతమైన స్థానం కల్పించటానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, జలీల్ ఖాన్, బొండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, పోలీసు హౌసింగ్ బోర్డ్ ఛైర్మన్ నాగుల్ మీరా, సీనియర్ నాయకులు తూమాటి ప్రేమ్‌నాథ్, మాజీ డెప్యూటీ మేయర్లు, మాజీ కార్పొరేటర్లు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.