కృష్ణ

దుర్గగుడి ట్రస్ట్‌బోర్డు చైర్శన్‌గా రంగప్రసాద్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, జూన్ 22: శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌గా బిజెపికి చెందిన వీరమాచినేని రంగప్రసాద్ నియమితులు కానున్నట్లు సమాచారం. డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి సిఎంగా ఉన్న సమయంలో దుర్గగుడికి ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేశారు. భవానీల తొక్కిసలాట దుర్ఘటన నేపథ్యంలో బోర్డును రద్దు చేశారు. అనంతరం అధికారంలోకి వచ్చిన టిడిపి అసలు ట్రస్ట్‌బోర్డునే ఏర్పాటు చేయలేదు. ఎట్టకేలకు బుధవారం ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ దుర్గగుడికి 16 మంది సభ్యులతో కూడిన ట్రస్ట్‌బోర్డును చైర్మన్ లేకుండా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ప్రకటించిన యలమంచలి గౌరంగబాబును ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌గా నియమించాలని టిడిపి నేతలు పట్టుబట్టినా మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అంగీకరించలేదని సమాచారం. దుర్గగుడి ట్రస్ట్‌బోర్డు చైర్మన్ వ్యవహారంలో అటు బిజెపి ఇటు టిడిపి రాజీపడకపోవటంతో రెండు పార్టీలకు చెందిన ముఖ్యనేతలు కల్పించుకుని ముందు ట్రస్ట్‌బోర్డును ఏర్పాటు చేయాలని సూచించటంతో న్యాయ కోవిదుల సలహా మేరకు రాష్ట్ర ప్రభుత్వం ట్రస్ట్‌బోర్డును ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ట్రస్ట్ బోర్డు చైర్మన్‌ను ఈ నెల 26న ఎన్నుకునే విధంగా రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. చైర్మన్‌గా బిజెపికి చెందిన వీరమాచినేని రంగప్రసాద్‌నే ఎన్నుకోవాలని ముందుగానే ట్రస్ట్‌బోర్డు సభ్యులకు అందరికీ చెప్పి వారు అంగీకరించిన తర్వాతనే జీవో విడుదల చేసినట్లు బిజెపికి చెందిన ఒక సీనియర్ నేత తెలిపారు.