కృష్ణ

‘మీ-సేవ’లపై విస్తృత ప్రచారం అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 22: మీ-సేవ కేంద్రాల్లో అందిస్తున్న సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ బి.లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గల మీ-సేవ కేంద్రాన్ని గురువారం సాయంత్రం కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. మీ-సేవ కేంద్రాలు అందిస్తున్న సేవలపై అక్కడ వున్న ప్రజలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో 450కి పైగాను, నగరంలో 43 మీ-సేవ కేంద్రాలు ప్రజలకు పలు సేవలు అందిస్తున్నాయన్నారు. వీటిలో ముఖ్యంగా రెవెన్యూపరమైన ఆదాయ, నివాస, కుల ధ్రువీకరణ పత్రాలు జనన, మరణ పత్రాలు, విద్యుత్ బిల్లు, ఇంటి పన్నులు, టెలిఫోన్ బిల్లు మొదలగు 159 సేవలు అందిస్తున్నాయన్నారు. ప్రతి మీ సేవ కేంద్రాల వద్ద అందుబాటులో ఉన్న అందిస్తున్న సేవల వివరాలతో కూడిన డిస్‌ప్లే బోర్డులను ఏర్పాటుచేయాలని ఆదేశించారు. తెల్ల రేషన్ కార్డుదారులకు ఆదాయ ధ్రువీకరణ పత్రం అవసరం లేదని, అయినప్పటికీ ఆదాయ ధ్రువీకరణ పత్రం కావలసిన వారు ధ్రువీకరణ పత్రంలో వివరాలు నింపి ఆదాయానికి సంబంధించిన ఆధారాలను జతచేసి మీ-సేవ కేంద్రాల వద్ద 35 రూపాయలు రుసుము చెల్లించి నమోదు రశీదు పొందవచ్చునన్నారు. అర్జీతోపాటు ఆదాయం తెలుపుతూ పది రూపాయల నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్‌పై వ్యక్తిగత అఫిడవిట్ నకలు రెండు కాపీలు, ఆధార్ కార్డు నకలు సమర్పించవలసి ఉంటుందన్నారు. మీ-సేవ ద్వారా వచ్చిన అర్జీలను సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారులు విచారణచేసి, అర్హతను బట్టి వారం రోజుల్లో ఆదాయ ధ్రువీకరణకు సిఫార్స్ చేస్తారన్నారు. తహశీల్దార్ కార్యాలయం నుండి జారీచేసిన ధ్రువీకరణ పత్రాన్ని సంబంధిత మీ-సేవ కేంద్రాల వద్ద నుండి పొందాలన్నారు. ఈ తనిఖీలో విజయవాడ ఆర్‌డివో ఎస్.హరీష్, అర్బన్ తహశీల్దార్ ఆర్.శివరావు, మీ-సేవ ఎవోజి చైతన్య, మేనేజర్ సిహెచ్ శ్రీకాంత్, కోఆర్డినేటర్ విష్ణు తదితరులు పాల్గొన్నారు.