కృష్ణ

మంత్రి ఉమకు సత్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు, జూన్ 22: గోదావరి జలాలకు స్వాగతం పలికిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును పలువురు రైతులు, టిడిపి నాయకులు గురువారం ఘనంగా సత్కరించారు. మండలంలోని సీతారామపురం గ్రామం వద్ద మంత్రి దేవినేని గోదావరి జలాలకు జలపూజ నిర్వహించి స్వాగతం పలికారు. అనంతరం పలువురు రైతులు, పార్టీ నాయకులు ఉమను సత్కరించారు. అనంతరం మంత్రి ఉమ మీర్జాపురం గ్రామంలోని వెంకన్న చెరువు పనులను పరిశీలించారు. పనులు నత్తనడకన సాగుతుండటంతో సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులను వేగవంతంగా పూర్తిచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, పాల్గొన్నారు.