కృష్ణ

ఐవైఆర్‌ను తొలగించిన తీరు గర్హనీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట, జూన్ 22: బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఐవైఆర్ కృష్ణారావును ప్రభుత్వం తొలగించిన తీరు ఆక్షేపణీయమని, గాయత్రి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు సివిఎన్‌ఎల్ నరసింహరావుతో సహా బ్రాహ్మణ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. గురువారం రాత్రి పట్టణంలోని గాయత్రి బ్రాహ్మణ కల్యాణ మండపంలో జరిగిన సమావేశంలో యూత్ అధ్యక్షుడు కొమరగిరి భరద్వాజ్, ప్రముఖులు కీసర రాంబాబు, డాక్టర్ కనకలింగేశ్వరరావు, కృష్ణశర్మ, బాచినప కోటేశ్వరరావుతదితర ప్రముఖులు మాట్లాడుతూ ప్రభుత్వం తాను నియమించిన పోస్టులో ఎవరిని ఉంచాలి, ఎవరిని తొలగించాలనేది ప్రభుత్వ నిర్ణయమైనా కృష్ణారావును తొలగించిన తీరు సరికాదన్నారు. ప్రభుత్వ పథకాలను బ్రాహ్మణులకు అందించి బ్రాహ్మణ్యం ప్రభుత్వం వైపు చూస్తున్న తరుణంలో ఐవైఆర్‌ను తొలగించిన ఘటన బ్రాహ్మణులకు బాధ కల్గించేదిగా వారు పేర్కొన్నారు. దీనిపై త్వరలో కార్యాచరణను చేపట్టనున్నట్లు వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో మాచిరాజు కేశవరావు, పిరాట్ల శంకరశాస్ర్తీ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.