గుంటూరు

ప్రగతికి పారిశ్రామికాభివృద్ధి గీటురాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 22: రాష్ట్రప్రభుత్వం చేపట్టిన పారిశ్రామిక ప్రగతి కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. బుధవారం స్థానిక రెవెన్యూ కళ్యాణ మండపంలో జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఇ) స్థాపనకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలతో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. ఇప్పటివరకు జరిగిన పారిశ్రామికవేత్తల సదస్సులో ప్రభుత్వం అనేక కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుందన్నారు. తద్వారా వేల కోట్ల రూపాయలతో అనేక కంపెనీలు తమ సంస్థలను రాష్ట్రంలో స్థాపించనున్నాయన్నారు. ప్రభుత్వ ఒప్పందం ప్రకారం కంపెనీలు రాష్ట్రం ఏర్పడితే సుమారు 30 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయంలో వ్యవసాయం, అనుబంధ రంగాలు ముందంజలో ఉన్నాయని, అయితే పారిశ్రామిక, సేవారంగాలు వెనుకబడి ఉన్నాయని, ఈ దృష్ట్యా ప్రభుత్వం రాష్ట్రాన్ని పారిశ్రామికరంగంగా మరింత అభివృద్ధి దిశలో నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఐక్యరాజ్య సమితి నిర్ణయించినట్లున ఈ నెల 27న అంతర్జాతీయ పరిశ్రమల దినోత్సవాన్ని రాష్టస్థ్రాయిలో విజయవాడలో ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్యక్రమంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ తాడికొండ నియోజకవర్గంలో నాలుగు ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయని, ఆ కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు పరిశ్రమల స్థాపనపై సంపూర్ణ అవగాహన కల్గించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానంగా నియోజకవర్గంలోని మేడికొండూరు మండలంలో పరిశ్రమల స్థాపనకు కావాల్సిన వనరులు మెండుగా ఉన్నాయన్నారు. బ్యాంకర్లు కూడా ప్రభుత్వం చేపడుతున్న పారిశ్రామిక అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన అదనపు జాయింట్ కలెక్టర్ ముంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో పారిశ్రామికరంగ అభివృద్ధికి జిల్లా యంత్రాంగం పలు చర్యలు తీసుకుంటోందని చెప్పారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు 11 దరఖాస్తులు వచ్చాయని, వాటిని వివిధ కారణాల వల్ల తిరస్కరించినట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ అజయ్‌కుమార్, గుంటూరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు, ఎల్‌డిఎం సుదర్శనరావు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ఇంజనీరింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.