గుంటూరు

సకాలంలో భూగర్భ డ్రైనేజీ పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 22: గుంటూరు నగరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ పనులను సకాలంలో పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. గురువారం వివిధ ప్రాంతాల్లో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ పనులను నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనూరాధతో కలిసి పరిశీలించారు. ఉద్యోగ నగర్ వద్ద పల్లోంజి కంపెనీ ప్రతినిధులు పనుల కోసం తెచ్చుకున్న మెటీరియల్‌ను తనిఖీచేసి వాటి నాణ్యత, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇన్నర్ రింగ్‌రోడ్డు శ్రీరామ్‌నగర్ 4,8 లైన్లలో జరుగుతున్న పైపులైను పనులను తనిఖీ చేశారు. ప్రకాష్‌నగర్‌లో నిర్మిస్తున్న మురుగునీటి శుద్ధి యూనిట్ నిర్మాణ పనులను పరిశీలించి రోజుకు ఎన్నిలీటర్ల శుద్ధి చేస్తుంది అన్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వికాస్‌నగర్ 6వ లైనులో నిర్మిస్తున్న సెప్టిక్‌ట్యాంక్ నిర్మాణ పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిర్ధేశిత గడువులోగా పనులు పూర్తిచేయాలని స్పష్టంచేశారు. పనులను వేగవంతం చేయడంతో పాటు నాణ్యతా ప్రమాణాలను విధిగా పాటించాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. పబ్లిక్ హెల్త్, ఇంజనీరింగ్ అధికారులు ప్రతిరోజూ పనులను తనిఖీలు చేయాలన్నారు. నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు సైతం పనులను ప్రతిరోజూ పరిశీలించి లక్ష్యాలను నిర్ధేశించుకుని దాని ప్రకారం పనులను పూర్తిచేయాలన్నారు. ప్రతిరోజూ కనీసం 3 కిలోమీటర్ల మేర పనులు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులు, కాంట్రాక్టర్లకు సూచించారు. ప్రతివారం పనులకు సంబంధించిన పూర్తి నివేదికలు తనకు అందజేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట పబ్లిక్ హెల్త్ ఎస్‌ఇ శ్రీనివాసరావు, నగరపాలక సంస్థ ఎస్‌ఇ డి మరియన్న తదితరులు పాల్గొన్నారు.