శ్రీకాకుళం

మానససరోవరంలో చిక్కుకున్న ‘సిక్కోల్’ యాత్రికులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జూన్ 22: మానససరోవరం యాత్రకు వెళ్ళిన యాత్రికుల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన 42 మంది అక్కడే చిక్కుకుపోయారు. తిరుగుప్రయాణంలో ప్రతికూల వాతావరణం ఏర్పడటంతో సెమికోస్ట్ వద్ద చిక్కుకున్న వారిలో విశాఖపట్నం జిల్లా యాత్రికులతోపాటు శ్రీకాకుళం జిల్లా యాత్రికులు ఉన్నారు. సెమికోస్ట్ నుంచి నేపాల్ గంజ్ వరకూ రాకపోకలు వాతావరణం అనుకూలించక నిలిచిపోయాయి. హెలికాఫ్టర్ సేవలు సైతం అధికారులు నిలిపివేసారు. దీంతో మరో మూడు రోజులపాటు రాకపోకలు ఉండవంటూ అక్కడ అధికారులు ప్రకటించడంతో, మరో వారం రోజులపాటు సిక్కోల్ యాత్రికులు అక్కడే ఉండిపోవల్సిన పరిస్థితి ఉంటోందని ప్రైవేటు ట్రావెలర్స్ చెబుతున్నారు. మొబైల్స్ సైతం పనిచేయకపోవడంతో యాత్రకులు అవస్థలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న వారి కుటుంబ సభ్యులంతా ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చిక్కుకుపోయిన సుమారు 1000 మంది మానససరోవరం భక్తులను సురక్షిత ప్రాంతాలకు తీసుకువచ్చేందుకు తగిన చర్యలు ప్రారంభించినప్పటికీ వాతావరణం అనుకూలించకపోవడంతో సహాయక చర్యలు యాత్రికులకు అందుబాటుకావడం లేదని అక్కడ అధికారుల సమాచారం. ఏదిఏమైనప్పటికీ, సెమికోస్ట్ - నేపాల్ గంజ్ మధ్య ఇరుక్కున్న వెయ్యి మంది తెలుగుయాత్రికుల్లో శ్రీకాకుళం జిల్లా యాత్రికులు ఉండడంతో ఇక్కడ జిల్లా కలెక్టర్ కె.్ధనుంజరెడ్డి సంబంధిత ట్రావెల్స్‌కు వివరాలు సేకరించాలంటూ ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. అలాగే, గతంలో ఇక్కడ యాత్రికులు మానససరోవరం యాత్రలో చిక్కుకున్నప్పటి నుంచి అటువంటి యాత్రలకు వెళ్ళే వారంతా కలెక్టరేట్‌లో తగిన సమాచారం ఇచ్చి వెళ్ళాలంటూ చేసే విజ్ఞప్తి మేరకు సమాచారం ఇచ్చిన వారి బంధువుల నుంచి తగిన సమాచారం సేకరించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందించే పనిలోకూడా జిల్లా యంత్రాంగం తలమునకలయ్యింది. నేపాల్ భూకంపం అనంతరం నేలం రోడ్డు పూర్తిగా రాకపోకలకు అంతరాయం కలగడంతో సరికొత్తగా ప్రారంభించిన లక్నో మార్గం గుండా నేపాల్‌ను తాకకుండా నేరుగా సెమీకోస్టుకు చేరే మార్గంలో యాత్రికులకు ఈ అవస్థలు ఏర్పడినట్టు అక్కడ అధికారులు ప్రకటించినట్టు సమాచారం. శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల నుంచి వెళ్ళిన యాత్రికులు మాత్రం హైదరాబాద్ ట్రావెల్ ఏజెంట్ ద్వారా వెళ్ళినట్టు విశ్వసనీయంగా తెలిసింది.