శ్రీకాకుళం

ఆసుపత్రి ప్రసవాలు పెంచండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎచ్చెర్ల, జూన్ 22 : గర్భిణీలకు మరింత అవగాహన పెంచి ఆసుపత్రి ప్రసవాలు పెంచేందుకు వైద్యాధికారులు, సిబ్బంది కృషి చేయాలని వైద్య ఆరోగ్యశాఖ జాయింట్ డైరక్టర్ డాక్టర్ సావిత్రి స్పష్టం చేశారు. పొన్నాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ బగాది జగన్నాధరావుతో కలసి తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి ఓ.పి సేవలు పెరగాలన్నారు. మందులు నిల్వలను కూడా అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధులపై మరింత అప్రమత్తంగా ఉండాలని సిబ్బంది క్షేత్రస్థాయిలో పౌరులకు మెరుగైన సేవలందించాలన్నారు. మాతాశిశు మరణాలు నివారించేలా ఆసుపత్రి ప్రసవాలను పెంచే రీతిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వైద్య ఆరోగ్యశాఖ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు 5 అభివృద్ధి పథకాలు రూపొందించారని వీటిని ఒకే గొడుగు క్రిందకు తీసుకువచ్చేలా ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య పలు భాద్యతలను అధికారులకు అప్పగించారన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ, చంద్రన్న సంచార వైద్యం, టెలిరెడియో స్కాన్ సేవలు, తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్, ఎన్టీఆర్ బేబి కిట్స్ పంపిణీ కార్యక్రమాలు ప్రజల ముంగిటికి చేరుతున్నాయా లేదా అన్న అంశాలపై వైద్యాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె ఆదేశించారు. పిహెచ్‌సి పరిసరాలు మరింత సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. డాక్టర్ సిహెచ్.బాలసుందర్, ఈఓ శ్రీనివాసరావు, ఫార్మశిస్ట్ రేవతిరావులు ఉన్నారు. అనంతరం జెడి ఇబ్రహీంబాద్, పూడివలసల్లో నిర్వహిస్తున్న చంద్రన్న వైద్య సేవలను పరిశీలించి అక్కడ ప్రజలను ప్రభుత్వ వైద్యసేవలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు.