విశాఖ

రైతులకు భరోసాగా జగన్ మహాధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 22: భూములను దోచుకుంటున్న అధికార పార్టీ పెద్దల నుంచి కాపాడే ప్రయత్నంలో వైకాపా మీకు అండగా ఉంటుందంటూ జగన్‌మోహన రెడ్డి గురువారం నగరంలో నిర్వహించిన మహాధర్నాతో రైతులకు భరోసానిచ్చారు. ధర్నాలో భాగంగా రైతులతో జగన్ ముచ్చటించి వారిలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. పెందుర్తి మండలం ముదపాకలో అసైన్డ్ రైతు గణేష్ తమ భూములు కాజేసేందుకు అధికార పార్టీ బినామీలు ఏ విధంగా బెదిరించారన్నది వివరించారు. నాలుగు విడతల్లో సుమారు 400 ఎకరాల ప్రభుత్వ భూమిని తమకు పట్టాలు పంపిణీ చేశారన్నారు. అయితే కొంతమంది రియల్ ఎస్టేట్ దళారులు గ్రామంలో రైతులకు కొంత మొత్తం అడ్వాన్సులుగా చెల్లించి భూములకు సంబంధించిన పట్టాలు తీసుకున్నారని, రైతులతో కాగితాలు రాయించుకున్నారన్నారు. రుణమాఫీ అడగరు, పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాల్సిన అవసరం ఉండదని, రైతుల భూములను లాగేసుకుంటున్నారని మండిపడ్డారు. ముదపాక గ్రామానికే చెందిన మరో రైతు వరలక్ష్మి మాట్లాడుతూ భూములు ఇచ్చేందుకు నిరాకరించామని, తమ భూముల్లో అనుమతిలేకుండా రహదార్లు వేశారన్నారు. ఎదురు తిరిగినందుకు పోలీసు కేసులు పెట్టించారని కంటతడిపెట్టారు. రోలుగుంట మండలం జెపి అగ్రహారానికి చెందిన మాజీ సైనికోద్యోగి వెంకట్ మాట్లాడుతూ గ్రామంలో రైతులు సాగుచేసుకుంటున్న 450 ఎకరాల భూమిలో 130 ఎకరాలను టిడిపి నేతకు పాసుపుస్తకం జారీ చేశారని, ఇదేమిటని అడిగితే ఎదురుతిరిగారన్నారు. మీ భూములు మీకు కావాలంటే రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. నక్కపల్లి మండలం అమలాపురం గ్రామంలో 275 ఎకరాల కొండ పోరంబోకులో 50 ఎకరాలను ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకున్నారని గోవింద్ అనే వ్యక్తి ఆరోపించారు. 38 మంది పేరిట ఈ భూములు నమోదయ్యాయని, వీరంతా ఎమ్మెల్యే అనిత బినామీలుగా ఆరోపించారు.