విశాఖ

మావోల బంద్ విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, జూన్ 22: విశాఖ మన్యంలో గిరిజనులను పోలీసులు అక్రమంగా నిర్భంధిస్తుండడాన్ని నిరసిస్తూ మావోయిస్టు పార్టీ ఇచ్చిన ఏజెన్సీ బంద్ పిలుపు గురువారం పాడేరు ప్రాంతంలో విఫలమయ్యింది. మావోల బంద్ పిలుపును ఈ ప్రాంత వాసులు పట్టించుకోకపోవడంతో ప్రజా జీవనానికి ఎటువంటి ఆటంకం ఏర్పడలేదు. వ్యాపారులు తమ దుకాణాలను తెరిచి యధావిధిగా తమ వ్యాపార లావాదేవీలను నిర్వహించుకున్నారు. పాడేరు ఆర్.టి.సి. డిపోకు చెందిన బస్సులు ఏజెన్సీలోని అన్ని రూట్లలో నిర్వహించారు. అయితే మావోల ప్రాబల్యం అధికంగా ఉన్న చింతపల్లి, గూడెంకొత్తవీధి ప్రాంతాలకు కొన్ని బస్సు సర్వీసులను రద్దు చేసారు. ప్రయివేట్ వాహనాలు కూడా మామూలుగానే తిరిగడంతో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, బ్యాంకులు, పెట్రోలు బంకులు పనిచేసాయి. పాడేరు మండలం గుత్తులపుట్టులో గురువారం వారపు సంత కొనసాగింది. ఇదిలాఉండగా మావోయిస్టుల బంద్ పిలుపును పురస్కరించుకుని పోలీసు యంత్రాంగం గట్టి భద్రతా చర్యలను చేపట్టింది. ఏజెన్సీలోని అన్ని ప్రాంతాలలో వాహనాల తనిఖీని ముమ్మరంగా చేపట్టి అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. మారుమూల గ్రామాలలో పోలీసు బలగాలు విస్తృత గాలింపు చర్యలను చేపట్టి మావోల కదలికలను కట్టడి చేసారు. ప్రభుత్వ కార్యాలయాలకు భద్రతను కల్పించి నిఘాను పటిష్టం చేసారు. మావోల బంద్ పిలుపుతో అధికార తెలుగుదేశం పార్టీ నేతలకు ముప్పు పొంచి ఉండడంతో పోలీసులు ముఖ్యమైన నాయకులను అప్రమత్తం చేసి మైదాన ప్రాంతానికి వెళ్లిపోవాలని సూచించారు. దీంతో కొంతమంది దేశం నాయకులు మైదాన ప్రాంతాల్లో తలదాచుకున్నారు. మావోల బంద్ విఫలం కావడమే కాకుండా ఎక్కడా ఎటువంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకపోవడంతో పోలీసు యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది.