విజయనగరం

జిల్లాలో 1.92 హెక్టార్లలో ఖరీఫ్ పంటలు సాగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొండపల్లి,జూన్ 22: జిల్లాలో ప్రస్తుత ఏడాది ఖరీఫ్ లో 1.92 కోట్ల హెక్టార్లలో పంటలు సాగు చేయటం లక్ష్యమని జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకురాలు లీలావతి అన్నారు. గురువారం ఆమె బొండపల్లిలో విలేఖరులతో మాట్లాడుతూ 1.19 లక్షల హెక్టార్లలో వరి సాగు, మిగిలిన 73 వేల హెక్టార్లలో మిగిలిన రకాల పంటలు సాగు చేయటం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే 220 హెక్టార్లలో ఆకుమడులు వేశారని చెప్పారు. జిల్లాకు 51వేల క్వింటాళ్ల విత్తనాలు కేటాయించాలని ప్రతిపాదన చేశామని, ఇప్పటికే కేంద్రాలలో 30 వేల క్వింటాళ్ల విత్తనాలు విక్రయానికి సిద్ధంగా ఉంచామన్నారు. జిల్లాలో 2.5 లక్షల భూసార పరీక్ష కార్డులను పంపిణీ చేశామని, మిగిలిన రెండు వేల కార్డులు త్వరలో అందజేస్తామన్నారు. జిల్లాకు 450 టన్నుల జింకు, 1350 టన్నుల జిప్సం, 20టన్నులు కేటాయించామని చెప్పారు. సమావేశంలో గజపతినగరం సబ్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకురాలు ఆర్.అన్నపూర్ణ పాల్గొన్నారు.