విజయనగరం

రైతులందరికీ విత్తనాలు అందించేలా చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొండపల్లి, జూన్ 22: రైతులందరికీ వరి విత్తనాలు అందేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా వ్యవసాయ సంయుక్తసంచాలకురాలు లీలావతి అన్నారు. గురువారం బొండపల్లి ప్రాథమిక సహకార వ్యవసాయ పరపతి సంఘం కార్యాలయంలో జెడి లీలావతి, ఎంపిపి పిరిడి ఎల్లమ్మ, జడ్పీటిసి బండారు బాలాజీల చేతులమీదుగా రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా బయోమెట్రిక్ విధానం ద్వారా విత్తనాలు విక్రయిస్తున్నామని చెప్పారు. వెబ్‌లాండ్‌లో పొందుపరచని రైతుల పేర్లను ఒకజాబితా రూపొందిస్తామని తెలిపారు. జడ్పీటిసి బండారుబాలాజీ మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విత్తనాలు సరఫరా చేయాలని కోరారు. రైతులు ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో గజపతినగరం సబ్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకురాలు ఆర్. అన్నపూర్ణ, మండల వ్యవసాయ అధికారి కె.రవీంద్ర, గ్రామ సర్పంచ్ వర్రి సత్యవేణి, ఏఇఓలు వెంకటరమణ, సొసైటీ సిఇఓ కర్రి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.