తూర్పుగోదావరి

వరదలపై అప్రమత్తంగా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూన్ 22: గోదావరి వరదలపై అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సబ్‌కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. గురువారం తన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో గోదావరి వరదలపై ముందస్తు సమావేశాన్ని నిర్వహించారు. గోదావరి వరదల సమయంలో తమకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వర్తించాలని, సంబంధిత అధికారులంతా తమ ఫోన్ నెంబర్లను తమ కార్యాలయంలో అందించాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను సురక్షితంగా తరలించేందుకు తగిన కార్యాచరణ రూపొందించాలన్నారు. ముందస్తు అనుమతి తీసుకున్న తరువాతే సెలవులు మంజూరుచేస్తామన్నారు. వరదలపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు మండల, డివిజన్‌స్థాయిలో కంట్రోల్‌రూమ్‌లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈసమావేశంలో జలవనరుల శాఖ ఇఇ పి సుధాకర్‌రావు, డిఇలు రత్నరాజు, ఎం రమేష్, ఆర్టీఓ సిరి ఆనంద్, ఎపిఇపిడిసిఎల్ డిఇ జి శ్యాంబాబు, ఎడిఇ డి శ్రీ్ధర్‌వర్మ, బోటు సూపరింటెండెంట్ జి ప్రసన్నకుమార్, అగ్నిమాపకశాఖాధికారి ఎన్ పార్థసారధి, మత్స్యశాఖ ఎడిఓ కె రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.