తూర్పుగోదావరి

యువత మాఫియా ఉచ్చులో చిక్కుకోవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూన్ 22: గిరిజన యువత డ్రగ్, గంజాయి మాఫియా ఉచ్చులో చిక్కుకోవద్దని ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎన్ సూర్జిత్‌సింగ్ సూచించారు. గురువారం ఆదికవి నన్నయ్య యూనివర్శిటీలో డ్రగ్స్ వాడకం, అక్రమ రవాణాపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి మాఫియా వల్ల 173 మంది గిరిజన యువత విశాఖపట్నం, 102 మంది యువత రాజమహేంద్రవరం సెంట్రల్‌జైలులో శిక్ష అనుభవిస్తున్నారన్నారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు. ఆదికవి నన్నయ్య యూనివర్శిటీ వైస్‌చాన్సలర్ ఆచార్య ఎం ముత్యాలనాయుడు మాట్లాడుతూ విద్యార్థులు డ్రగ్స్‌కు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, విద్యపై దృష్టి కేంద్రీకరించి, దేశాభివృద్ధికి పాటుపడాలన్నారు. అదనపు ఎస్పీ గంగాధర్ మాట్లాడుతూ శక్తిమంతమైన డ్రగ్స్‌మాఫియా యువత, విద్యార్థుల భవిష్యత్‌ను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని, ఈవిషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏజెన్సీ నుంచి రాజమహేంద్రవరం జాతీయ రహదారి మీదుగా గంజాయి అక్రమ రవాణా జరుగుతోందన్నారు. ట్రస్టు ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ రామకృష్ణ, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్ లక్ష్మీకాంత్, వెంకటరామిరెడ్డి, ఇనస్పెక్టర్లు హుస్సేన్, ప్రకాష్ పాల్గొన్నారు.