తూర్పుగోదావరి

పాలనావ్యవస్థలో రెవెన్యూ కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రావులపాలెం, జూన్ 22: పరిపాలనా వ్యవస్థలో రెవెన్యూ వ్యవస్థది కీలక పాత్రని, దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రతి గ్రామంలోను గ్రామ రెవెన్యూ కార్యాలయాల నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేస్తోందని శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. రావులపాలెంలోని చిన్న వంతెన సమీపంలో ఉన్న రెవెన్యూ స్థలంలో గురువారం ఆయన గ్రామ రెవెన్యూ కార్యాలయ భవన నిర్మాణానికి భూమిపూజ చేసి, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ పోతుమూడి విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానంలో భాగంగా రావులపాలెం మండలంలోని ఊబలంక, గోపాలపురం ఇసుక ర్యాంపుల్లో పాట నిర్వహణ ఛార్జీలుగా వసూలు చేసిన మొత్తాన్ని తహసీల్దారు, ఎంపిడిఒల సంయుక్త బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నారని, నిర్వహణ పోగా ప్రస్తుతం రూ.35 లక్షలు నిల్వ ఉందని, ఈ నిధులు దుర్వినియోగం కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించామన్నారు. ఈ విషయాన్ని మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, డిసిఎంఎస్ ఛైర్మన్ కెవి సత్యనారాయణరెడ్డితో కలిసి జిల్లా కలెక్టరు దృష్టికి తీసుకెళ్లామన్నారు. కలెక్టర్ అనుమతితో రూ.18 లక్షలు వెచ్చించి రావులపాలెం, రావులపాడు, గోపాలపురం, ఊబలంక గ్రామాల్లోని పాత గ్రామ కచేరి చావిడి భవనాల స్థానంలో కొత్తగా విఆర్వో కార్యాలయాలు నిర్మించేందుకు చర్యలు చేపట్టామన్నారు. అలాగే రావులపాలెంలో గ్రామస్థుల కోరిక మేరకు ఈ నిధులతో బస్ షెల్టర్ నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. ప్రభుత్వం అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని, రాజకీయాలకు తావులేదని ఆయన అన్నారు. అనంతరం నగదు రహిత లావాదేవీలు చేపట్టిన వారిలో ఎంపికైన మహిళలకు మొబైల్ ఫోన్లు అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, డిసిఎంఎస్ ఛైర్మన్ కెవి సత్యనారాయణరెడ్డి, ఉప సర్పంచ్ కొవ్వూరి జగన్నాథరెడ్డి, ఆత్మ కమిటీ ఛైర్మన్ జక్కంపూడి వెంకటస్వామి, ఎఎంసి మాజీ ఛైర్మన్ బండారు వెంకట సత్తిబాబు, సర్పంచులు నెక్కంటి వెంకన్న, కుడుపూడి వెంకటేశ్వర్లు, టిడిపి నాయకులు గుత్తుల పట్ట్భా రామారావు, పెచ్చెట్టి చిన్నారావు, ఎస్ జనార్దనరాజు, కెవి రామిరెడ్డి, తహసీల్దారు సిహెచ్ ఉదయభాస్కర్, విఆర్వో ఏడుకొండలు, కార్యదర్శి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.