పశ్చిమగోదావరి

అభివృద్ధికి పరిశ్రమలు దోహదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూన్ 22 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిశ్రమలను స్థాపించేందుకు గాను ఎంతో ప్రోత్సహిస్తున్నాయని, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ప్రభుత్వ సహకారాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, నిరుద్యోగ సమస్య తీరుతుందని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ త్రిమూర్తులు అన్నారు. గురువారం స్థానిక అంబికా ఫ్లేవర్స్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల స్థాపనపై లభించు ప్రోత్సాహకాలు, అనుమతులు మంజూరు, విధి విధానాలపై అధికారులు వివరించారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ త్రిమూర్తులు మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీన అంతర్జాతీయ ఎస్ ఎం ఎ ఇ దినోత్సవంగా ప్రకటించారన్నారు. మన రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని విజయవాడలో నిర్వహించనున్నారని, దీనికి ముందుగా మూడు రోజులపాటు అవగాహనా సదస్సును నిర్వహించాలని ఆదేశాలుజారీ చేయడంతో అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. రాష్ట్ర విభజన అనంతరం అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు ఎంతో అవసరమని భావించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశ్రమల స్థాపనకు ఎంతగానో సహకరిస్తున్నారన్నారు. ఎన్నో పధకాలను ప్రవేశపెడుతున్నారని, జిల్లాలో ప్రతీ బుధవారం జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ అధ్యక్షతన పరిశ్రమల శాఖ సమావేశం నిర్వహిస్తున్నారన్నారు. సమావేశంలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల సందేహాలను నివృత్తి చేస్తున్నట్లు ప్రకటించారు. పరిశ్రమల స్థాపనకు అనుమతులు కేవలం ఏడు రోజుల్లోనే చేస్తామని, సింగిల్ విండో సిస్టమ్‌ను ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో కిరణ్‌కుమార్, ఎల్ డి ఎం ప్రసాద్‌బాబు, పారిశ్రామిక వేత్తలు మురళీకృష్ణ, ఆంజనేయ శర్మ, సి ఆర్ ఆర్ పిజి కళాశాల డైరెక్టర్ డాక్టర్ కొండయ్య, శశి ఇంజనీరింగ్ కళాశాల ప్రొఫెసర్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.