కడప

లోక్ అదాలత్ ద్వారా కేసులకు శాశ్వత పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దవటం,జూన్ 22:లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించబడే కేసులకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని జిల్లా ప్రధాన జడ్జి జి.శ్రీనివాస్ తెలిపారు. గురువారం స్థానిక జూనియర్ సివిల్ జడ్జికోర్టులో జూలై 8న జరిగే జాతీయ లోక్ అదాలత్ కేసుల పరిష్కారంపట్ల న్యాయవాదులు, పోలీసులతో జిల్లా జడ్జి సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంపౌండబుల్ కేసులపై 337,338 తదితర కేసుల్లో పెండింగ్‌లో ఉన్నా పరిష్కరించుకోవచ్చునన్నారు. అలాగే ఎక్సైజ్ కేసులు, సెక్షన్ 41, 49, 50, 86, 178, 179, 180 తదితర నెంబర్ల కేసుల్లో సింగిల్ చార్జిషీట్ ఫైల్‌చేసి కేసులు పరిష్కరించుకోవచ్చునని పోలీసులకు సూచించారు. నేషనల్ లోక్ అదాలత్‌కు సంబందించి అన్ని రకాల ఫారాలు సిద్ధంగా ఉంచామన్నారు. అందరు సహకరించి జిల్లాను ప్రథమస్థానంలో నిలిపేందుకు కృషి చేయాలన్నారు. ఫిబ్రవరిలో జరిగిన లోక్ అదాలత్‌లో మూడవస్థానంలో ఉన్న కడప జిల్లా ఏప్రిల్‌లో 13వ స్థానానికి చేరిందన్నారు. న్యాయవాదులు నష్టపోకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇరు పక్షాల అంగీకారంతో రాజీచేసి , కోర్టుల చుట్టు తిరిగి కక్షిదారులు శ్రమపడకుండా కేసులు పరిష్కరించుకోవచ్చునన్నారు. లోక్ అదాలత్‌ద్వారా పరిష్కరించబడే కేసులకు అప్పీల్ ఉండదన్నారు. అలాగే రూ.4.80కోట్లతో సిద్దవటం కోర్ట్భువనానికి నిధులు మంజూరైనట్లు ఆయన తెలిపారు. రైల్వేకోడూరులో కోర్టు భవనం పూర్తయ్యిందని, మైదుకూరు కోర్టు భవనానికి కూడా నిధులు మంజూరయ్యాయన్నారు. న్యాయవాదులు ముందుండి నాయకత్వం వహించి స్ర్తిశక్త్భివనంలోకి మారేందుకు సహకరించాలన్నారు. ఈసందర్భంగా కోర్టు ప్రాంగణంలో నిలిచి వున్న వాహనాలపై ఆయన ఆరా తీశారు. ఆయా వాహనాలు పరిశీలించారు. ఈకార్యక్రమంలో సబ్ జడ్జి నరసింహమూర్తి, సిద్దవటం జూనియర్ సివిల్ జడ్జి ఎన్.రాజశేఖర్, ఏపిపి శ్రీనివాసులు, ఒంటిమిట్ట సిఐ రవికుమార్, సిద్దవటం, ఒంటిమిట్ట, అట్లూరు మండలాల ఎస్‌ఐలు అరుణ్‌రెడ్డి, ధనుంజయ, మహ్మద్ రఫి, లోక్ అదాలత్ న్యాయవాదులు లక్ష్మిరెడ్డి, శివరామ్, న్యాయవాదులు రామ్‌దాస్, రత్నం, సుధామణి, ఆదినారాయణ, సివి సుబ్బారెడ్డి, ఎంఎల్‌ఎస్‌సి సిబ్బంది మార్టీనా, బాబూరావు, సోషల్ వర్కర్ చలపతి తదితరులు పాల్గొన్నారు.