కర్నూల్

నంద్యాల మున్సిపల్ చైర్‌పర్సన్‌పై చర్యకు రంగం సిద్ధం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, జూన్ 22: ఇఫ్తార్ విందు కోసం నంద్యాలకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును స్థానిక మంత్రి భూమా అఖిలప్రియ, నంద్యాల శాసన సభ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి, మాజీ మంత్రి ఎన్‌ఎండి ఫరూక్‌లతోపాటు 26 మంది కౌన్సిలర్లు కలుసుకున్నారు. ఇఫ్తార్ విందు అనంతరం ఆర్‌అండ్‌బి అతిథి గృహానికి చేరుకున్న ముఖ్యమంత్రి ఎదుట రాత్రి 1 గంట ప్రాంతంలో కౌన్సిలర్లు బల ప్రదర్శన చేశారు. దీంతో కౌన్సిలర్లకు మీరేమి దిగులు చెందాల్సిన అవసరం లేదని, మెజార్టీ కోల్పోయిన చైర్‌పర్సన్‌ను దించేందుకు వెనుకాడబోమని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఇటీవల మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డి వైకాపా తీర్థం పుచ్చుకున్న విషయం విధితమే. ఆయన వర్గానికి చెందిన దేశం సులోచన చైర్‌పర్సన్‌గా పనిచేస్తున్నారు. ప్రతిపక్ష నేత జగన్‌ను శిల్పామోహన్‌రెడ్డి కలుసుకున్న సమయంలో తన వెంట 24 మంది కౌన్సిలర్లు ఉన్నట్లు చెప్పుకున్నారు. నంద్యాల మున్సిపల్ కౌన్సిల్‌కు 42 మంది కౌన్సిలర్లు ఉండగా, అందులో 29 మంది తెలుగుదేశం పార్టీ టికెట్‌పై గెలిచారు. మరో 13 మంది కౌన్సిలర్లు వైకాపా టికెట్‌పై గెలిచారు. నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి టిడిపిలో చేరడంతో ఆయన వర్గానికి చెందిన 12 మంది కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరి కౌన్సిల్‌లో తమకు ఎదురులేకుండ చేసుకున్నారు. అయితే శిల్పామోహన్‌రెడ్డి టిడిపికి రాజీనామా చేసి వైకాపా తీర్థం పుచ్చుకోవడంతో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు కౌన్సిల్‌లో తమకే బలం ఉందని, చైర్‌పర్సన్‌ను పదవి నుండి తొలగించాలని ముఖ్యమంత్రికి విన్నవించినట్లు తెలిసింది. బుధవారం రాత్రి ముఖ్యమంత్రిని కలిగిన వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయకుమార్‌తో కలసి 26 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. దీంతో శిల్పామోహన్‌రెడ్డి వర్గంలో కేవలం 15 మంది కౌన్సిలర్లే ఉన్నారని, వారిలో కూడా మరికొంత మంది మనవైపు వచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు మంత్రి భూమా అఖిలప్రియ ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ఏది ఏమైనా నిబంధనల ప్రకారం ప్రమాణ స్వీకారం చేసిన చైర్‌పర్సన్‌ను నాలుగు సంవత్సరాల వరకు అవిశ్వాస తీర్మాణం పెట్టి తొలగించకూడదని ఉన్నప్పటికి నంద్యాల శాసన సభ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకొని మున్సిపల్ కౌన్సిల్‌లో తెలుగుదేశం పార్టీకి సంపూర్ణ మెజార్టీ ఉండడంతో చైర్‌పర్సన్‌ను ఎలాగైనా పదవి నుండి తొలగించేందుకు మార్గాలు అనే్వశిస్తున్నట్లు తెలిసింది. మొత్తం మీద చైర్‌పర్సన్ దేశం సులోచనకు పదవిగండం పొంచి వుంది.