కర్నూల్

నంద్యాల స్మార్ట్‌సిటీకి ప్రణాళికలు సిద్ధం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, జూన్ 22: నంద్యాల పట్టణాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కలెక్టర్ సత్యనారాయణ, జెసి ప్రసన్న వెంకటేష్‌లను ఆదేశించారు. గురువారం నంద్యాల ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈసందర్భంగా సిఎం మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో రోడ్ల విస్తరణ, ఫుట్‌పాత్‌ల నిర్మాణం, మురుగుకాల్వల నిర్మాణం, సుందరీకరణ, పార్కుల అభివృద్ధి తదితర పనులకు ప్రతిపాధనలు సిద్ధం చేయాలన్నారు. నంద్యాల అభివృద్ధి చేసేందుకు నిధుల కొరత లేదని, పను లు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలన్నారు. పట్టణంలో 4.8 కి.మీ.ల రోడ్లు ఆర్‌అండ్‌బి పరిధిలో ఉన్నాయని, వీటిని ఫోర్‌లైన్ రోడ్ల కింద అభివృద్ధి చేసేందుకు రూ. 60 కోట్లు ఖర్చు అవుతుందని, ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రికి నివేదించారు. అలాగే పంచాయతీరాజ్ విభాగం కింద 45 కి.మీ.ల సిసి రోడ్లు వేయాల్సి ఉందని, త్వరలోనే వీటిని పూర్తి చేస్తామని ఆ శాఖ ఎస్‌ఇ సుబ్బరాయుడు అన్నారు. చామకాల్వ పూడిక తీత పనులను నీటి పారుదల శాఖ త్వరగా చేపట్టాలని ఇరిగేషన్ సిఇని ఆదేశించారు. నంద్యాల పట్టణంలోని రోడ్ల విస్తరణ, ఇతర వౌలిక సదుపాయాల పనులకు రూ.75 కోట్లు అవసరం ఉంటుందని పురపాలక శాఖ డైరెక్టర్ కన్నబాబు ముఖ్యమంత్రికి నివేదించారు. నంద్యాల బైపాస్ రోడ్డును త్వరగా పూర్తి చేయాలని జాతీయ రహదారుల పిడిని సిఎం ఆదేశించారు. నంద్యాల పట్టణంలోని ప్రతి ఇంటికి ఫైబర్ ఇంటర్‌నెట్ కనెక్షన్ ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ, పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ, పురపాలక శాఖ డైరెక్టర్ కన్నబాబు, కలెక్టర్ సత్యనారాయణ, జెసి ప్రసన్న వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.