కర్నూల్

విద్యార్థులకు వరం ‘సిఎం బాల సురక్ష’..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలుటౌన్, జూన్ 22:‘నేటి బాలలే భావి భారత పౌరులు’ అనే నినాదానికి కట్టుబడి ముఖ్యమంత్రి చంద్రబాబు ‘సిఎం బాల సురక్ష’ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద పుట్టిన చిన్నారి నుంచి ఇంటర్ వరకూ(18ఏళ్ల లోపు) అనారోగ్యంతో బాధపడుతున్న బాలబాలికలకు 30 రకాల వ్యాధులకు పరీక్షలు నిర్వహించన్నున్నారు. ఈ మేరకు బాలబాలికలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని విద్య, వైద్యం, ఐసిడిఎస్ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. 18 ఏళ్ల లోపు కల విద్యార్థులు జిల్లాలో దాదాపు 6.5 లక్షల మంది ఉన్నారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఎయిడెడ్, ప్రాథమిక పాఠశాలలతో పాటు ఇంటర్ విద్యార్థులకు ఈ పథకాన్ని అందించాలన్నదే ప్రధాన ఉద్దేశ్యం. అమలు చేయాల్సిన శాఖలు చిత్తశుద్ధితో ముందుకు సాగితే ఈ పథకం మంచి ఫలితాన్ని ఇస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఇక జిల్లాలో జిల్లా సమగ్ర శిశు అభివృద్ధి ప్రాజెక్టులు 16 ఉండగా వాటి పరిధిలో 3,548 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. అందులో మూడేళ్ల లోపు చిన్నారులు 2లక్షల మంది ఉండగా, పలు రకాల వ్యాధులతో బాధపడుతున్న వారు 18వేల మంది చిన్నారులు ఉన్నారని ఆ శాఖ అధికారులే నివేదిక అందజేశారు. వీరందరికీ కూడా సిఎం బాల సురక్ష పథకాన్ని అందించవచ్చని ఆదేశాలు జారీ చేశారు.
30 రకాల వ్యాధుల్లో ప్రధానంగా మందబుద్ధి, కంటిచూపు, రక్తహీనత, విటమిన్ లోపం, చర్మ వ్యాధులకూ చికిత్స అందించవచ్చు. ఈ పథకాన్ని ఈ నెలాఖరులో సిఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. కావున ఆయా శాఖల యంత్రాంగం ‘సిఎం సురక్ష పథకం’పై విద్యార్థుల తల్లిదండ్రులకు, చిన్నారుల తల్లులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.