కరీంనగర్

నాకు భూములుంటే స్వాధీనం చేసుకోవచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, జూన్ 22: ప్రజల ఓట్లతో గెలుపొంది అధికారం చేపట్టిన ప్రజాప్రతినిధులు ప్రజాఅవసరాలు విస్మరించి, తమ స్వార్థ ప్రయోజనాలే లక్ష్యంగా పాలన కొనసాగిస్తున్నారని, దీనిని వెలెత్తిచూపే వారిపై లేనిపోని ఆరోపణలు చేస్తూ, ఆత్మాభిమానం దెబ్బతీస్తున్నారని ప్రజాసంఘాల జెఎసి రాష్ట్ర కన్వీనర్ గజ్జెల కాంతం అన్నారు. గురువారం నగరంలోనిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, దిగువ మానేరు జలాశయంలో చేపడుతున్న ఎలగందుల రహదారి నిర్మాణంతోప్రజలకు ఒరిగేదేమి లేదని, ప్రజాసొమ్ము దుర్వినియోగమవుతుందంటూ హైకోర్టులోపిటిషన్ వేస్తే, కరీంనగర్ నుంచి అసిఫ్‌నగర్ వరకు తనకు వందల ఎకరాల భూములు ఉన్నట్లు తప్పుడు ఆరోపణలు చేస్తూ, తనను అప్రదిష్టపాలు చేసేలా హైకోర్టు ధర్మాసనానికి అడ్వకేట్ జనరల్ నివేదికలు అందించటం హాస్యాస్పదమన్నారు. నగర పరిసరాల్లో తనకు గుంట భూమి ఉన్నా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదలకు పంచుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధి,గుత్తేదారులు,అధికారులు కుమ్ముక్కై అడ్వకేట్ జనరల్‌కు తప్పుడు సమాచారమిచ్చారని, దానిని పరిశీలించకుండా యధాతధంగా హైకోర్టుకు సమర్పించి, ధర్మాసనాన్ని తప్పుదారి పట్టించిన ఎజి రామకృష్ణారెడ్డిని తొలగించాలని డిమాండ్ చేశారు. నీటిలోరహదారులు నిర్మిస్తే దీర్ఘకాలం పనిచేయవని సుప్రీంకోర్టు చేసిన సూచనలు కూడా పట్టించుకోకుండా అటు ప్రభుత్వాన్ని, ఇటు కోర్టును ఎజి మోసం చేస్తున్నాడని దుయ్యబట్టారు. ప్లై ఓవర్ వేసుకోమని హైకోర్టు సూచిస్తే, బేఖాతర్ చేస్తూ నీటిలోనే రహదారి నిర్మాణపనులు చేపడుతుండటం వెనుక ఆంతర్యమేంటని ఆయన ప్రశ్నించారు. రెండు దశాబ్దాలనుంచి నిరంతరం ప్రజాసేవలో తరిస్తున్న తనకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేని కొంతమంది అధికారులు, అధికార నేతలు, అధికార పార్టీ పత్రికతో కలిసి తన ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని, దీనిపై పరువునష్టం దావా వేసేందుకు సిద్దమవుతున్నట్లు వెల్లడించారు. అధికార పార్టీ పత్రిక అధినేత రాజధానిలోని మియాపూర్‌లోచేసిన భూకుంభకోణం అందరికీ తెల్సిందేనని, స్థానిక ప్రజాప్రతినిధి అవినీతి, అక్రమాలపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈసమావేశంలోబిసి సంక్షేమసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేశిపెద్ది శ్రీ్ధర్‌రాజు, ప్రజాసంఘాల జెఎసి జిల్లా అధ్యక్షుడు మేడి మహేశ్, నాయకులు సుద్దాల లక్ష్మన్, దుడ్డెల ప్రశాంత్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.