కరీంనగర్

సెక్యులరిజం పేరుతో అణచివేస్తే సహించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, జూన్ 22: సెక్యూలరిజం పేరుతో హిందువులను అణచివేస్తే సహించేది లేదని విశ్వహిందు పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు అన్నారు. గురువారం జగిత్యాల పట్టణంలోని గీతాభవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మట్లాడుతూ గత కొన్ని రోజులుగా జగిత్యాల, కోరుట్ల కేంద్రాల్లో ఇక్కడి అధికారులు, రాజకీయ నాయకులు హిందువులను అణిచివేసే చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గోహత్య రాజ్యాంగ విరుద్దమని, గోవులను చంపడం నిబంధనలకు విరుద్దగా వాహనాలను తరలించడం నిత్య కృత్యమైందన్నారు. ఈ విషయంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, ఫిర్యాదు చేసిన తమ కార్యకర్తలను భయంభ్రాంతులకు గురి చేయడంతో పాటు అక్రమ కేసులు బనాయిస్తున్నారని అన్నారు. గతంలో ఐఎస్‌ఐ తీవ్రవాది అజంఘోరి ఇక్కడ కార్యకలాపాలు సాగించారని, పోలీసుల వైఖరీతో మళ్లీ అలాంటి పరిస్థితి తలెత్తే అవకాశం ఉందనే అనుమానం వ్యక్తం చేశారు. గత నాలుగు రోజుల క్రితం భజరంగ్‌దళ్ ద్వజాన్ని దగ్దం చేసిన నిందితులను పట్టుకోవడంలో పోలీసులు విఫలం అయ్యారని, నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేసిన కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు తమ వైఖరిని మార్చుకోని పక్షంలో విహెచ్‌పి అధ్వర్యంలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామన్నారు. ఇటీవల జరిగిన పీస్ కమిటీ సమావేశంలో కొంతమంది మైనార్టీ నాయకులు భారత్‌మాతాకిజై, వందేమాతరం అనడం తప్పు అన్నట్లుగా అధికారుల ముందు మాట్లాడినప్పటికీ వారు వౌనంగా ఎలా ఉన్నారని ప్రశ్నించారు. సిఎం కెసిఆర్ ఓట్ల కోసం ముస్లీం సంతుష్టీకరణ విధానాన్ని అనుసరిస్తున్నారని అన్నారు. షాదీ ముబారక్, తోఫా పేరుతో లక్షాలాది రూపాయలు వెచ్చిస్తున్నారని, మెజార్టీ ప్రజలైన హిందువులకు దసరా కానుకులు ఎందుకు ఇవ్వడం లేదని రామరాజు అన్నారు. మెజార్టీ వర్గాన్ని అణచివేయడమే సెక్యూలరిజంగా భావిస్తూ మైనార్టీలు చేసే తప్పులకు పోలీసులు రక్షణగా నిలుస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగ బద్దంగా వ్యవహరించాల్సిన పోలీసులు కొమ్ముకాసే విధానాన్ని మానుకోవాలన్నారు. తమ కార్యకర్తలపై దురుసుగా వ్యవహరించడంతో పాటు పరుష పదజాలం ఉపయోగించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో తాము అందోళన కొనసాగిస్తామని రామరాజు హెచ్చరించారు. అంతకుముందు జిల్లా ఎస్పీని అనంతశర్మను కలిసి కార్యకర్తలపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్ భగవంతరావు, భజరంగ్‌దల్ అధ్యక్షుడు సుభాష్‌చందర్, కరీంనగర్, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, వెంకట్‌రాజిరెడ్డి, నాయకులు భాను ప్రకాష్, రాజమల్లయ్య, సంతోష్, తవుటు రాంచంద్రం, బిజెపి నాయకులు బాజోజి భాస్కర్, రవీందర్‌రెడ్డి, అముదు రాజు ఉన్నారు.