రంగారెడ్డి

వంద శాతం హరితహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 22: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం మూడవ విడతలో జూలై 1వ తేదీ నుండి 15 వరకు వంద శాతం మొక్కలు నాటేందుకు అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు ఆదేశించారు.
గురువారం కలెక్టరేట్‌లో హరితహారం పై ఓఎస్‌డిలు, ఎంపిడిఓలతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై 1వ తేదీ నుండి 15 వరకు హరితహారంలో భాగంగా పెద్దఎత్తున మొక్కలు నాటాలని అన్నారు.
జిల్లాలోని 415 గ్రామ పంచాయతీలలో గ్రామ పంచాయతీకి 40 వేల మొక్కల చొప్పున మొత్తం 1 కోటి 66 లక్షల మొక్కలు నాటుట లక్ష్యంగా ఉందని తెలిపారు. ఎంపిడిఓల ద్వారా టిజిఎఱ్‌ఎంఐఎస్ పోర్టల్‌లో జిల్లా శాఖాధికారులు వైబ్‌సైట్ యూసర్ ఐడి, పాస్‌వర్డ్ తీసుకోవాలని సూచించారు. ఏ నర్సరీల నుండి ఏ ఎంపిడిఓలు మొక్కలు తీసుకోవాలో తెలియచేయబడుతుందని, ఎంపిడిఓల అనుమతి లేనిదే ఒక్క మొక్క కూడా నర్సరీ నుండి ఇవ్వబడదని తెలిపారు. గ్రామాలలో సిఇఓలు మొక్కలు నాటేందుకు అనువైన ప్రదేశాలు గుర్తించి గుంతలు తీయాలని సూచించారు. మొక్కలను సంరక్షించేందుకు కంచెలను ఏర్పాటు చేసుకోవాలని, నాటిన మొక్కలను రక్షించేందుకు ఉపాధి హామీ కూలీలతో నీళ్లు పోయించాలని అన్నారు.
నర్సరీలలో పూల మొక్కలు, పళ్ల మొక్కలు, ఈత, యూకలిప్టస్, టేకు, తుమ్మ మొదలగు చెట్లు సిద్ధంగా ఉన్నాయని, ఈ మొక్కలు పాఠశాలలు, పంచాయతీరాజ్ బిల్డింగ్‌లు, ఆసుపత్రులు, కార్యాలయాలు, చెరువుల గట్ల పై, పొలాల గట్ల పై, తహసీల్దారు, మండల కార్యాలయాల వద్ద నాటేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.
హరితహారంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనే విధంగా, పాఠశాల విద్యార్థులను, పిల్లలను బాగా ప్రోత్సహించి వారి భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని తెలిపారు. జిల్లాలో గుడుంబా తయారీ మరియు అమ్మకాలు వృత్తిగా ఏర్పరుచుకుని ప్రస్తుతం భృతిని కోల్పోయిన 335 మందికి రెండు లక్షల ఆర్థిక సాయంతో పాటు పునరావాసం కల్పించుటకు వారి డాక్యుమెంట్‌లు సంబంధిత ఎండిఓలు పరిశీలించి వారికి ఆర్థిక సహాయం అందించే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు.
సబ్సిడీ ద్వారా రుణ సహాయం పొందిన ఎస్సీ, ఎస్టీ లబ్దిదారుల యొక్క యూటిలైజేషన్ సర్ట్ఫికెట్‌లు వెంటనే సమర్పించాలని ఎంపిడిఓలను ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నార్, అటవీ శాఖాధికారి వినోద్, డిఆర్డిఓ ప్రశాంత్ కుమార్, జెడ్‌పి సిఇఓ రమణారెడ్డి, ఆర్డీఓలు, వ్యవసాయశాఖాధికారి జెడి జగదీశ్, తహశీల్దార్‌లు, ఎంపిడిఓలు, ఎక్సైజ్, ఎడిఎలు, ఎఓలు పాల్గొన్నారు.