హైదరాబాద్

ఎల్‌ఇడి లైట్లతో ఎంతో ఆదా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 22: మహానగరంలోని జిహెచ్‌ఎంసి అన్ని కార్యాలయాలతో పాటు ప్రతి ఇంట్లో కూడా ఎల్‌ఇడి లైట్ల వినియోగాన్ని పెంచి, విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు జిహెచ్‌ఎంసి ప్రణాళికను సిద్దం చేసింది. నగరంలో మొత్తం 22లక్షల కుటుంబాలుండగా, కేవలం నాలుగు లక్షల ఇరవై వేల ఎల్‌ఇడి లైట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. కానీ ప్రతి ఇంట్లో ఎల్‌ఇడి లైట్లను వినియోగిస్తే విద్యుత్ వినియోగం, బిల్లుల భారం తగ్గటంతో పాటు వెలుగులు కూడా పెరుగుతాయన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి, దేశంలో ఏ కార్పొరేషన్ సాధించని ఫలితాలు సాధించే దిశగా జిహెచ్‌ఎంసి కృషిని ప్రారంభించింది. ఇందులో భాగంగానే నగరంలో స్వయం సహాయక బృందాలు ఎల్‌ఇడి లైట్లను విక్రయించేలా ఈఈఎస్‌ఎల్‌తో బుధవారం చారిత్రక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. నగరంలో మొత్తం కోటి ఎల్‌ఇడి లైట్లను విక్రయించేందుకు రంగం సిద్దం చేసింది. గతంలో కేవలం జిహెచ్‌ఎంసికి చెందిన అన్ని కార్యాలయాల్లో ఈఈఎస్‌ఎల్ ద్వారా ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేసి విక్రయించే ఈ లైట్లను ఇపుడు మహిళా స్వయం సహాయక బృందాల ద్వారా విక్రయించనుంది. కొనుగోలు చేసే వారికి మార్కెట్‌లో ఇతర బల్బుల ధర కన్నా తక్కువ ధరకే బల్బును అందించటంతో పాటు బల్బు ధరలో పది శాతాన్ని స్వయం సహాయక బృందాలకు, సిటీలెవల్ ఫెడరేషన్‌కు అందించాలని జిహెచ్‌ఎంసి సిద్దమైంది. ఈ బల్బుల విక్రయం ద్వారా మహిళా సంఘాలకు రూ. పది కోట్ల వరకు ఆదాయం సమకూరనుంది. ఇందుకు గాను గతంలో ఎన్నడూ, ఏ కార్పొరేషన్ చేసుకోని విధంగా స్వయం సహాయక బృందాలతో చారిత్రక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది. నగరంలోని ప్రతి ఇంటికి నాలుగు ఎల్‌ఇడి లైట్లను అందించగలిగి, వారు వాటినే వినియోగించినట్లయితే 130 కోట్ల యూనిట్ల విద్యుత్ ఆదా అవుతోందని, అలాగే రూ. 500 కోట్ల వరకు విద్యుత్ బిల్లుల భారం తగ్గుతుందని అధికారులంటున్నారు. దీంతో పాటు పదివేల టన్నుల కార్బన్‌డైయాక్సైడ్ విడుదలను కూడా అడ్డుకోవచ్చునని పేర్కొంటున్నారు. అంతేగాక, ఒక్కో ఎల్‌ఇడి బల్బు ఇచ్చే వెలుగు సాధారణ బుల్బు కన్నా నాలుగు రేట్లు ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని ప్రజల్లోకి విస్త్రృతంగా తీసుకెళ్లినపుడు తాము లక్ష్యంగా పెట్టుకున్న లక్ష్య బల్బుల విక్రయం సాధ్యమవుతుందని అధికారులు భావిస్తున్నారు.