హైదరాబాద్

సరికొత్త విజ్ఞానానికి ప్రాధాన్యం ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, జూన్ 22: విజ్యార్థులు కొత్త విజ్ఞానాన్ని నేర్చుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలని విజయవాడ ఐఆర్‌ఎస్ చీఫ్ ఇంజనీర్ సాంబిరెడ్డి సూచించారు. బాచుపల్లిలోని విఎన్‌ఆర్ విజెఐఇటి కళాశాలలో విజెఐఇటి, ఎన్‌ఐటి వరంగల్ సంయుక్తంగా 10 రోజుల పాటు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఇసిఇ) ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం ప్రారంభమైంది. ఈ ప్రోగ్రామ్‌లో సిగ్నల్ ప్రాసెస్సింగ్ అండ్ ఐటిఎస్ అప్లికేషన్స్ అనే అంశంపై పరిశ్రమ నిపుణులు, అధ్యాపకులు ఈ రంగంలో చోటుచేసుకున్న ఆధునిక పద్ధతులపై సమీక్షిస్తారు. కార్యక్రమానికి విజయవాడ ఐఆర్‌ఎస్ చీఫ్ ఇంజనీర్ సాంబిరెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడుతూ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. సిగ్నల్ ప్రాసెస్సింగ్‌కు మంచి భవిష్యత్తు ఉందని, అధ్యాపకులు, విద్యార్థులు ఈ రంగంపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రస్తుతం శక్తి అనే పదాన్ని విజ్ఞానం అనే దానికి ఉపయోగిస్తున్నారని చెప్పారు. ఇండియా ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉందని, చిన్నచిన్న దేశాలు చాలా అభివృద్ధి సాధించాయని అన్నారు.
ప్రస్తుతం ఐటి రంగంలో సంధి కాలం కొనసాగుతున్న నేటి తరుణంలో విద్యార్థులు కొత్త టెక్నాలజీని నేర్చుకోవాలని, అధ్యాపకులు సైతం తమ పరిజ్ఞానాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. కార్యక్రమంలో విజ్ఞాన్ జ్యోతి ప్రెసిడెంట్ డాక్టర్ డిఎన్ రావు, విఎన్‌ఆర్ విజెఐఇటి ఇసిఇ బ్రాంచ్ హెచ్‌ఓడి డాక్టర్ పద్మసాయి, వరంగల్ ఎన్‌ఐటి ఇసి హెచ్‌ఓడి డాక్టర్ కిషోర్ కుమార్ పాల్గొన్నారు.