రంగారెడ్డి

బ్రాహ్మణ సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలాపూర్, జూన్ 22: బ్రాహ్మణ సంక్షేమానికి కేటాయించిన నిధులను మొక్కుల పేరుతో పక్కదారి పట్టించకుండా, ప్రతి బ్రాహ్మణుడికి ఉపయోగపడే విధంగా చిత్తశుద్ధితో వినియోగించాలని మాజీ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. గురువారం బడంగ్‌పేట్ నగర పంచాయతీ 4వ వార్డు సాయి కృష్ణా ఎన్‌క్లేవ్‌లో శ్రీశ్రీశ్రీ పంచముఖి ఆంజనేయస్వామి తృతీయ వార్షికోత్సవ కార్యక్రమానికి.. సబితా ఇంద్రారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వహకులు, స్థానిక నాయకులు.. సబితారెడ్డిని సత్కరించారు. సబితారెడ్డి మాట్లాడుతూ.. ఆంజనేయస్వామి కృపతో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. దేవుడి దయతో ఈ ఏడాది వర్షాలు సకాలంలో వచ్చాయని, రైతుకు పంట చేతికి అందేవరకు భగవంతుడు కాపాడాలని కోరారు. మూడు సంవత్సరాలుగా రైతులు అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారని అన్నారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణలోని ప్రతి దేవాలయానికి నిధులు ఇవ్వాలని కోరారు. బ్రాహ్మణ సంక్షేమ సంఘానికి రూ.100 కోట్లు కేటాయించినట్లు కెసిఆర్ పేర్కొంటున్నారని, బ్రాహ్మణ సంఘానికి కేటాయించిన నిధులను మొక్కుల పేరుతో పక్కదారి పట్టకుండా, ప్రతి బ్రాహ్మణుడి సంక్షేమానికి సక్రమంగా వినియోగించాలని కోరారు. కార్యక్రమంలో బడంగ్‌పేట్ నగర పంచాయతీ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర్ణగంటి అర్జున్, బడంగ్‌పేట్ వైస్ చైర్మన్ చిగురింత నర్సింహారెడ్డి, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ యాతం శ్రీశైలం యాదవ్, కౌన్సిలర్లు పెద్దబావి శ్రీనివాస్‌రెడ్డి, గౌర శారద సత్యనారాయణ, గుర్రం ప్రసన్న వెంకట్‌రెడ్డి, దండు గణేష్ ముదిరాజ్, దశరథ నాయక్, కోఅప్షన్ మెంబర్ వంగేటి ప్రభాకర్‌రెడ్డి, మీర్‌పేట్ నగర పంచాయతీ కాంగ్రెస్ అధ్యక్షుడు పల్లె జంగయ్య గౌడ్, లిక్కి కృష్ణారెడ్డి, బడంగ్‌పేట్ నగర పంచాయతీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు లగ్గాల సంజీవ తదితరులు పాల్గొన్నారు.