హైదరాబాద్

నిమ్స్‌లో నూతన గదుల ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, జూన్ 22: నిమ్స్ ఆసుపత్రిలో అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటుచేసిన నూతన గదులను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వెయ్యి కిడ్నీ మార్పిడి శస్తచ్రికిత్సలు పూర్తిచేసి దక్షిణ భారతదేశంలోనే నిమ్స్ ఆసుపత్రి అరుదైన రికార్డును సొంతం చేసుకుందని అన్నారు. 1989లో మొట్టమొదటిసారిగా నిమ్స్‌లో కిడ్నీ మార్పిడి శస్తచ్రికిత్స నిర్వహించారని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత 99 శాతం సక్సెస్ రేట్‌తో అవయవ మార్పిడి శస్తచ్రికిత్సలు ప్రభుత్వ రంగ ఆసుపత్రుల్లో కొనసాగుతున్నాయని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వసతులు కల్పించడంతో రోగుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. నిమ్స్‌లోని మిలీనియం బ్లాక్‌ను మరింత ఆధునీకరించనున్నట్టు చెప్పారు. నిమ్స్ ఆసుపత్రిలో ఉద్యోగులకు, విలేఖరులకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు చెప్పారు.
గర్భిణులకు ప్రభుత్వం తరఫున ప్రసూతి కిట్లను అందిస్తుండటంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నిమ్స్ డైరెక్టర్ మనోహర్, సూపరింటెండెంట్ నిమ్మ సత్యనారాయణ, వైద్యులు శ్రీ్భషన్ రాజు, రామిరెడ్డి, గంగాధర్ పాల్గొన్నారు.