మెయిన్ ఫీచర్

ఉక్కుమనిషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషికి వృద్ధాప్యం రాకతప్పదు. చాలామంది వృద్ధాప్యం వస్తుందంటే భయపడిపోతారు. అనారోగ్యాలు చుట్టుముడుతాయని, చరమాంకంలో తమను చూసేవారు ఉండరని ఆందోళన చెందుతారు. జీవనసాగరంలో ఎన్నో సుడిగుండాలను దాటివచ్చినా.. మలి సంధ్యలో ఇలాంటి భయాలకు లోనయ్యేవారికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు అరుణ్ కృష్ణన్. వృద్ధాప్యాన్ని వరంగా చేసుకున్న ఈ 67 ఏళ్ల అరుణ కృష్ణన్ కలలు సాకారం చేసుకోవటానికి మలిదశలోనూ సాధ్యమేనని నిరూపిస్తున్నారు. వయసు అనేది సంఖ్య మాత్రమే అనేది ఈ వృద్ధుడి నిశ్చితాభిప్రాయం. మలి వయసులోనూ అథ్లెటిక్ పోటీల్లో పాల్గొని చిరస్మరణీయమైన విజయాన్ని సొంతం చేసుకుని యువ అథ్లెట్స్‌కు సవాల్ విసిరారు. ఇండియన్ ఓల్డెస్ట్ ఐరన్‌మ్యాన్‌గా తన పేరు నమోదు చేసుకున్న అరుణ్ కృష్ణన్ ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన ట్రియథ్లాన్ (స్విమ్మింగ్, సైక్లింగ్, రన్నింగ్‌లో విజేతగా నిలిచారు. సీనియర్ సిటిజన్స్‌కే కాదు యువతకు సైతం స్ఫూర్తినిస్తున్న ఆదర్శ వ్యక్తిత్వం ఆయనది.
ఆటలతో మమేకం
చెన్నైకి చెందిన అరుణ్ కృష్ణన్‌ను ఇంజనీర్. బిజినెస్ కూడా చేశారు. చిన్నప్ప టి నుంచి ఆటలతో మమేకమయ్యారు. కాలేజీలో చదువుకునే రోజుల్లో స్విమ్మింగ్ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించారు. పరుగు ఆయనకు ప్రాణం. 1987 నుంచి ఎన్నో మారథాన్‌లో పాల్గొన్నారు. దేశ, విదేశాలలో జరిగే మారథాన్ పోటీల్లో పాల్గొంటారు. సింగపూర్, పారిస్, చికాగో, బెర్లిన్, టోక్యో మారథాన్‌లలో పాల్గొన్నారు. నేడు ఆసియా ఫిసిఫిక్ చాంపియన్ షిప్ సాధించి కామిక్ హీరోగా నిలిచారంటే అతిశయోక్తి కాదు. వ్యాపారం నుంచి పదవీ విరమణ తీసుకున్న ఈ వృద్ధుడు అరవైదాటినా విశ్రాంతికి దూరంగానే ఉన్నాడు. తన కలలను సాకారం చేసుకోవటానికి ఇప్పటికీ బీచ్‌లో పరుగుపెడుతూ ప్రాక్టీస్ చేస్తూంటారు దీక్షగా. అది ఆయన జీవనగమనంలో ఓ భాగం.
మానసిక బలమే పునాది..
ఇటీవల ఆస్ట్రేలియాలో నిర్వహించిన పోటీల్లో పాల్గొన్న ఆయన అలలు అంతెత్తున ఎగిసిపడుతున్నా ఏమాత్రం భయం లేకుండా 3.8 కిలోమీటర్లు ఈదారు. 180 కిలోమీటర్లు సైక్లింగ్ చేశారు. 42 కిలోమీటర్లు పరుగు పెట్టి యువ అథ్లెటిక్స్ సవాల్ విసిరారు. ఇవన్నీ కూడా నిర్ణీత సమయాని కంటే రెండు నిమిషాల 25 సెకెండ్ల ముందే పూర్తిచేయటం విశేషం. ఈ వృద్ధ యువకుని ప్రతిభ చూసి పోటీలు చూడటానికి వచ్చినవారంతా చప్పట్లో ఆయనను హుషారెత్తించారని ఆ దేశ ఛానళ్లలో కథనాలు ప్రసారమయ్యాయి. అరుణ్ కృష్ణన్ ఎన్నో మారథాన్‌లలో పాల్గొనగా.. ఈ పోటీని ఆయన సవాల్‌గా తీసుకున్నారు. ‘ఈ 67 ఏళ్ల వయసులో ఈ విజయం సాధిస్తానని నమ్మలేదు. కాని మనసు శరీరం మీద ప్రభావం చూపిస్తుందనుకుంటా. మానసిక బలంతో పాటు 24 వారాల శిక్షణ ఈ విజయానికి దోహదం చేసింది’ అని చెబుతున్నారు. నలభై ఏళ్లు దాటితేనే మోకాళ్ల నొప్పులు ఉంటాయి. అరుణ్ కృష్ణన్‌కు ఈ బాధ లేకపోలేదు. వైద్యులు పరుగు వద్దని, మెట్లు ఎక్కవద్దని సలహా ఇచ్చారు. కాని అరుణ్ కృష్ణన్ చిన్నపాటి వ్యాయామాలు చేసి కీళ్లకు బలాన్ని అందించారు. ఆయుర్వేద థెరపీ తీసుకున్నారు. బరువును నియంత్రించుకుంటూ ఈ పోటీల్లో పాల్గొన్నారు. సైక్లింగ్ చేసేటపుడు కాలి నొప్పి విపరీతంగా బాధపెట్టినా, రివ్వున ఎదురు గాలులు వీచినా.. అతని సంకల్పాన్ని సడలనివ్వలేదు. నరాల బలహీనతను అధిగమించి నిర్ణీత సమయం కంటే ముందే తన లక్ష్యాన్ని పూర్తి చేశారు.

‘ఇండియన్ ఒల్డెస్ట్ ఐరన్ మ్యాన్‌గా జీవితాంతం ఉండాలని భావిస్తున్నాను. ప్రపంచ మారథానర్‌గా పేరొందిన ఫౌజాసింగ్, 70 ఏళ్ల వయసులో మారథాన్‌లలో పాల్గొన్న వైట్లాక్ నాకు స్ఫూర్తినిస్తారు’.
- అరుణ్ కృష్ణన్

జీవనశైలి కీలకం
శారీరకంగా, మానసికంగా బలంగా ఉండాలన్నా.. అరవైదాటినా ప్రతిరోజూ ఉల్లాసంగా గడపాలంటే చక్కటి జీవనశైలి ఎంతో ముఖ్యం. అరుణ్ కృష్ణన్ కూడా అలాంటి జీవన విధానానే్న ఆచరిస్తున్నారు. దీనికి ఆయన భార్య కూడా తోడ్పాటునందిస్తుంది. ఆమె సహకారం వల్లనే తాను ఇలాంటి విజయాలను సొంతం చేసుకున్నారంటారు. అరుణ్ కృష్ణన్‌కు మద్యం, పొగ తాగరు. ఆలస్యంగా నిద్రపోవడం ఎరుగరు. మనసుకు, శరీరానికి ఆరోగ్యాన్నిచ్చే అలవాట్లే ఆయనను విజేతగా నిలిపాయి.
ఐరన్‌మాన్ సలహాలివి..
పోటీల్లో పాల్గొనాలనే కోరిక ఉంటే శిక్షణ తీసుకోవటం సులభం. ఓర్పుతో శిక్షణ పొందండి.
ఆహారంలో చక్కెర, ఎక్కువ పాలిష్‌చేసిన బియ్యాన్ని, ఉప్పును తగ్గించుకోండి. ప్రతిరోజూ వ్యాయామం చేయండి. వీలైనంత వరకు ధ్యానం చేయటం మంచిది.
మనసును ఎల్లప్పుడూ ఉల్లాసంగా ఉంచుకోండి. బ్రిడ్జ్, సుడుకో ఆటలను ఛాలెంజ్‌గా తీసుకుని ఆడటం నిత్యం చేస్తే మంచిది.
మారథాన్‌లో పాల్గొనాలనే ఆసక్తి ఉంటే ఇంటర్నెట్‌లో ఉచితంగా శిక్షణ ఇచ్చే సంస్థల సమాచారం దొరుకుతుంది.
శరీరం మనం చెప్పినట్లు ఉండాలంటే యోగాసనాలే ఉత్తమం.
ఏ ఆటలోనైనా రాణించాలంటే ముందు రన్నింగ్ చేయటం ఆరంభించండి.