ఐడియా

లుక్స్ ‘అధర’హో..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎర్రని పెదాలను ఎంతోమంది కవులు వర్ణించారు. అధరాల అందాలు.. అందించే మధువులని పొగడటం ఎప్పట్నుంచో ఉంది. అందుకే ట్రెండీ టీ షర్ట్స్ కానివ్వండీ, దుప్పట్లు కానివ్వండి.. ఇలా ఏ తరహాబట్టలపైన అయినా లిప్స్ ప్రింట్ అయితే అది అద్భుతమే అవుతుంది. వీటినిలా పక్కనపెడితే, లాకెట్స్, బ్రాస్‌లెట్స్, గాజులూ, నెక్లెసులూ, రింగ్స్‌తోపాటు క్లిప్పులూ, చెప్పులూ, బెల్టు బకెల్స్, స్కార్ఫూ, సాక్స్ ఇలా అన్ని యాక్ససరీస్‌కి పెదవుల డిజైన్స్ అద్దుకుని ముద్దులొలుకుతున్నాయి. ఫ్యాషన్ పరంగా అందరి హృదయాలను చూరగొన్న లిప్ అందాలు ఇప్పుడు పెన్‌స్టాండ్స్, సోఫాలు, కుర్చీలు, ఫర్నీచర్, పెన్‌డ్రైవ్స్, ఇతర ఇంటీరియర్ వస్తువులలోనూ ప్రతిఫలిస్తున్నాయి. సరికొత్త అందాలు ఇంట్లో ప్రవేశిస్తోన్న ఈ కాలంలో లిప్స్ డిజైన్స్ కర్టెన్స్ మీద కూడా రొమాంటిక్ ‘టింట్’ అద్దుతూ ముద్దు ముద్దుగా పలకరిస్తూ ఆహుతుల్ని అలరిస్తున్నాయి. పడగ్గది అలంకరణ కోసం ఎర్రటి పెదవుల ఫొటోలని ప్రింట్ చేసుకుని పోస్టర్స్ కూడా ఈ అందాల జాబితాలో చేరి లిప్స్ మీద ఉన్న అభిమానం చాటుకుంటున్నాయి. కేవలం ఈ తరహా డిజైన్స్ ఎరుపు రంగుతోనే కాకుండా ఇతర రంగులనీ అద్దుకుని సొబగులీనుతున్నాయి. వాటినో లుక్కేసుకోండి.

- తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి