Others

నెటిజన్ల నిద్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పుడంతా నెటిజన్ల కార్యక్రమాలే నిత్యకృత్యాలైపోయాయి. వైఫైలు వచ్చాక పగలు, రాత్రుళ్ళు తేడా లేకుండా చాలామంది నెట్ కార్యక్రమాలలోనే తమ జీవన విధానాన్ని గడిపేస్తున్నారు. ట్విట్టర్లు, ఫేస్‌బుక్, వాట్సాప్, గూగుల్ వంటి సైట్లలో వీరవిహారం చేస్తున్నారంటే ఆశ్చర్యపోవలసిన పనిలేదు.
ఇంటర్‌నెట్‌లో టచ్‌లో ఉండాలన్న ఆలోచనతో ప్రతి పదిమందిలో ముగ్గురు రాత్రిళ్ళు సరైన నిద్రపోవడం లేదని ఆస్ట్రేలియా పరిశీలకుల సర్వేలు తెలియజేస్తున్నాయి.
రాత్రి కాగానే బెడ్‌పైకి చేరి నిద్రపోకుండా స్మార్ట్ఫోన్ చేతిలోకి తీసుకుని నెట్ ఓపెన్ చేసి ఇష్టమైన సైట్లలోకి వెళ్లిపోయే వారి సంఖ్య రాను రాను పెరిగిపోతున్నది. తామేదైనా మిస్ అయిపోతామేమోనన్న భయంతో ట్విట్టర్, ఫేస్‌బుక్, వాట్సప్ లేదా ఇ-మెయిల్ ఎకౌంట్స్‌ను రాత్రి పడుకోడానికి ముందుగా తప్పనిసరిగా చెక్ చేసుకుంటామని ప్రతి ఐదుగురిలో ఇద్దరు చెబుతుండడం విశేషం. ప్రతి పదిమందిలో నలుగురు తాము తృప్తికరమైన నిద్రపోలేకపోతున్నామని వాపోతున్నారు.
ఈ సమస్యపై విస్తృతమైన అధ్యయనం నిర్వహించగా దాదాపు సగంమంది టెలివిజన్ కట్టేశాకే నిద్రకోసం బెడ్ దగ్గరకు వెళుతున్నట్లు చెప్పారు. ఐదుగురిలో ఇద్దరు ఇ-మెయిల్స్ చెక్ చేసుకోవడం కోసం చాలా సమయాన్ని రాత్రిళ్ళు వెచ్చిస్తుంటే చాటింగ్ చేస్తూ నిద్రపోకుండా రాత్రంతా మేలుకునేవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉండటం విశేషం.
మారిన పరిస్థితుల దృష్ట్యా నెట్ వాడకం అవసరం అయినప్పటికీ అవసరాన్ని మించి కాలాన్ని, డబ్బుని వృధా చేస్తున్నవారు యువతరంలో ఎక్కువ మంది ఉండటం విశేషం. సోషల్ వెబ్‌సైట్లలో వెల్లువెత్తుతున్న సంచలన విషయాలను షేర్ చేసుకోవడంలో ఉన్న ఉత్సాహం దాంపత్య సుఖం పట్ల చూపకపోవడం నిపుణులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.
నిద్రకు ఎక్కువగా దూరమవడం వలన అనేక అనారోగ్యాలు చుట్టుముట్టే అవకాశాలు లేకపోలేదు. కళ్ళు, శ్వాస అవయవాలు, బ్రెయిన్, హార్ట్ వంటి శరీర భాగాలు రోగగ్రస్థమయి ఇబ్బందులు పడటం ఖాయం అంటున్నారు శాస్తవ్రేత్తలు. ఏదైనా ఒక పరిధిని దాటిన సాంకేతిక పరిజ్ఞానం అనేక సమస్యలకు దారితీస్తుందని చెప్పాలి. ముఖ్యంగా నిద్రాహారాలు మానేసి నెట్ వెబ్‌సైట్లలో విహరించాలనుకోవడం, ఆవిధంగా ఎడిక్ట్ కావడం తెలివితక్కువతనంగా భావించవచ్చని విశే్లషకులు చెబుతున్నారు. కాబట్టి నెటిజన్లు నిద్రకు దూరం కాకండి. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి.

- హిమజారమణ