డైలీ సీరియల్

ట్విన్ టవర్స్ - 35

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూడు వారాలు తిరగకుండా, ఓ సాయంత్రం మా ఇంటి ముందు కారు ఆగింది. అందులో డాక్టర్‌గారు వారి అబ్బాయి ఉత్తరం పట్టుకు వచ్చారు. రాశాడు. అది చదివాక అందరూ తేలికగా ఊపిరి పీల్చుకున్నారు. అమ్మ లోపల నుంచి ఒక పళ్ళెంలో రెండు చక్రకేళి పళ్ళు పెట్టుకు వచ్చి నాన్నకు అందించింది. ఆ డాక్టర్ గారిని ఊళ్ళో తెలియని వాళ్ళు లేరు. చాలా పెద్ద పేరుంది. ఆయన ఫ్రీడమ్ ఫైటర్. ఖాదీ బట్టలు తప్ప కట్టేవారు కాదు. ఆయన నిరాడంబరత, నుదుట నల్లని చుక్క, ఎవరు వచ్చినా, చిరునవ్వుతో పలకరించే ఆయన వ్యక్తిత్వం అందరికీ తెలిసిందే!
ఆయన ఆ ఊళ్ళో పిలవని ఫంక్షన్, వెళ్ళని పెళ్లి ఉండేది కాదు. అలాగని బయట ఒక కప్ కాఫీ కూడా తాగేవారు కాదు. ఆ విషయం అందరికీ తెలుసు. అందుకే అమ్మ ఓ రెండు పండ్లు తీసుకు వచ్చింది.
ఆయన ఒక పండు తీసుకుని, ‘‘అన్నీ అవే చక్కబడతాయి, వర్రీ కాకండి’’ అంటూ కారు ఎక్కారు.
నాన్న కారు దాకా వెళ్లి ఆయన కూర్చోగానే ‘‘మీరు ఇంత శ్రమపడి రావాల్సింది కాదు. కబురు పంపితే నే వచ్చేవాడిని’’ అన్నారు నమస్కరిస్తూ.
ఆయన నాన్న భుజాన తడుతూ ‘‘మళ్లీ కలుద్దాం’’ అని వెళ్లిపోయారు. డాక్టర్‌గారి అబ్బాయి ఉత్తరం ఇంట్లో అందరికీ చాలా రిలీఫ్ ఇచ్చింది. సందిగ్ధంలో కొట్టుకోవడం అంత కష్టం మరొకటి ఉండదు.
రఘు అడ్వైజర్, డాక్టర్‌గారి అబ్బాయికి కొలంబియాలో తెలుసట. అందుకనే రఘు సంగతులు తెలియడానికి ఎక్కువ టైం పట్టలేదు.
డాక్టర్‌గారి అబ్బాయి రాసిన ఉత్తరం చాలా ధైర్యాన్నిచ్చింది.
‘‘డా. రఘురాం, అతని అడ్వైజర్ చాలా డిజ్‌అప్పాయింట్ అయ్యారు. ఇలాంటివి అరుదుగా సైంటిఫిక్ వరల్డ్‌లో జరుగుతూనే ఉంటాయి. సరిగ్గా వీళ్ళు రిలీజ్ చేసే కొద్ది నెలల ముందే మరొక దేశం రిలీజ్ చేశారు. దానితో వాళ్ళిద్దరూ చాలా పెద్ద దెబ్బతిన్నారు.
ప్రస్తుతం రఘురాం కొలంబియా వదిలేసి మరో యూనివర్సిటీకి వెళ్ళాడు. అతను చాలా బ్రిలియంట్ అన్న పేరుంది. అతని గురించి వర్రీ అవ్వవలసింది ఏమీ లేదు. కొంత టైం పోయింది. కానీ అతను మళ్లీ మరొకటి సాధించకపోడు. అతని అడ్వైజర్ చాలా గొప్పగా మాట్లాడాడు డా.రఘురాంని గురించి’’ అని రాశాడు.
ఉన్నచోటనుంచి, మరో ప్రాజెక్టుకి మారడం, ఊరు మారడం అన్నిటితో చాలా బిజీగా ఉండి ఉంటాడు అని సర్దుకోవడానికి ప్రయత్నించాం. నాన్న వెంటనే రఘు నాన్నగారి ఫోన్ చేసి చెప్పారు రఘు గురించి తెలిసిన సంగతులు.
‘‘ఏమిటి? మీరిలా చేస్తున్నారు? వాళ్ళనూ, వీళ్ళనూ అడిగి? నేను చెప్పాను కదా రఘు అంత బలహీనుడు కాడని! వాడు బోస్టన్ అన్న ఊరికి మారాడు అని చెప్పాడు. మీకు తెలిసే ఉంటుందని నేను ఇక పిలవలేదు’’ అన్నారు. ఆయన మాటల ధోరణి చూస్తే, నాన్న చేసిన పని ఆయనకు నచ్చినట్లు లేదు.
నాన్న చాలా బాధపడ్డారు. కనీసం వాళ్ళ అబ్బాయి ఫోన్ చేసి చెప్పినపుడు, ఇక్కడకు ఆ వార్త తెలియపరచాలని కూడా అనిపించలేదు.
నేను పైన డాబా ఎక్కి జాజిపూలు కోస్తున్నాను. కింద అమ్మతో అంటున్నారు నాన్న-
‘‘నాకసలు ఈ సమస్య ఎలా ఎదుర్కోవాలో అర్థం కావడంలేదు. కల్యాణికి వీలయినంత త్వరగా అమెరికా వెళ్లాలని ఉంది. అందుకే వౌళిని విడిచి వెళ్లడానికి కూడా సిద్ధపడింది. కాని, అక్కడనుంచి ఎటువంటి స్పందనా రావడంలేదు’’ అని నిట్టూర్చాను.
ఏమీ సమాధానం చెప్పలేని అమ్మ వౌనంగా ఉండిపోయింది. నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. నా వెనకనే ఆడుకుంటున్న వౌళిని ఎత్తుకుని క్రిందకు దిగాను. రఘు దగ్గర నుండి ఉత్తరాలే రావడంలేదు. కొత్త ఊరు, కొత్త అడ్రస్ ఏమీ తెలియవు. ఆఖరికి ఫోన్ నెంబర్ కూడా తెలియదు.
ఇంట్లో అందరూ అయోమయ స్థితిలో పడిపోయారు. రఘు కుటుంబం, బాగా అంటీ ముట్టనట్లు ఉంటున్నారు. చివరకు నాన్న ఒత్తిడి మీద రఘు కొత్త అడ్రస్ ఇచ్చారు.
నాన్న అడ్రస్ తెచ్చి నన్ను రఘుకు ఉత్తరం రాయమన్నారు.
‘‘రాయనన్నాను. ఎందుకు నాన్న అతను వద్దనుకుంటుంటే నేను డిస్టర్బ్ చేయడం’’ అన్నాను.
‘‘అలా కాదు కల్యాణి అతను చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. ఒంటరిగా ఉన్నాడు. మానసికంగా చాలా దెబ్బతిన్నాడు. ఈ సందర్భంలో పట్టుదలకు పోకూడదు. అతను సమాధానం ఇచ్చినా, ఇవ్వకపోయినా నువ్వు వారం వారం రాస్తూనే ఉండు’’ అన్నారు చాలా సీరియస్‌గా.
నాన్న మొహం వంక చూచాక, వౌనంగా అడ్రస్ తీసుకుని ఉత్తరం రాశాను. అతను కాగితాలు పంపడం ఎంత అవసరమో రాశాను. వౌళి బాధ్యత గురించి వర్రీ అవ్వద్దని రాశాను.

వాడు క్షేమంగా ఇక్కడే ఉంటాడు. ఇలా ఏమీ చేయలేని పరిస్థితిలో తనను పడవేయవద్దని రాశాను.
‘‘రోజులు ఒకేలా ఉండవు. మీరు కోరుకున్నది సాధించగలరు. కొంచెం ఆలస్యం అవ్వచ్చు. మీరు పేషన్స్ చూపాల్సిన సమయం ఇది.. మీ హీరో, మీ స్ఫూర్తి అయిన యెల్లాప్రగడ సుబ్బారావుగారు ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ మీకు తెలిసినవే! అవన్నీ దాటి ఆయన సాధించినది ఈ రోజు కూడా మెడికల్ వరల్డ్‌లో ఎంత అవసరమో మీరే చెప్పారు. ఆయన కృషి ఎంతగా పునాదులు వేశాయో మీరే చెప్పారు. అవన్నీ గుర్తుకు తెచ్చుకొని నిరుత్సాహపడకండి. ‘‘వేర్ దేర్ ఈజ్ ఎ విల్, దేర్ ఈజ్ ఎ వే’’!
ఉత్సాహం తెచ్చుకోండి. ‘బి పేషెన్స్’. మీతో మీ పక్కన కూచుని మీ చేతులు నా చేతుల్లోకి తీసుకుని మీ కళ్ళల్లోకి చూస్తూ నాకు ఇవి అన్నీ చెప్పాలనిపిస్తోంది. ఆ రోజు దగ్గరలో రావాలని రోజూ ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో అతనికి దూరంగా ఉండటం ఎంత బాధాకరంగా ఉందో రాశాను.
అయినా ఎటువంటి స్పందన లేదు!
నా రిజల్ట్స్ వచ్చాయి. చాలా మంచి మార్కులతో రాంక్‌లో వచ్చాను. కాని, ఎందుకనో మనసు అనుకున్నంతగా స్పందించలేదు. ఆ క్షణంలో అనిపించింది. జీవితంలో కేవలం పరీక్షలు పాస్ అవడం కంటే విలువైనదేదో చాలా ఉందని.
కాని, అది అర్థం చేసుకునే అదృష్టం కొద్దిమందికే ఉంటుంది. చాలామందికి అర్థం అయ్యేటప్పటికి సమయం చేయి జారిపోతూ ఉంటుంది కూడా!
అన్నయ్య ఎం.ఎ.కి అప్లికేషన్స్ తెప్పించాడు. దాన్ని పూర్తిచెయ్యమని ఇచ్చాడు. ఇంట్లో అందరికి వేరు వేరు అభిప్రాయాలు మెదిలినా ఎవ్వరూ పైకి ఏ మాత్రం తేలలేదు.
అందరిని చూచిపోదామని వచ్చిన చిన్నన్నయ్య మాత్రం అభ్యంతరం చెప్పాడు. దాన్ని పై ఊరు పంపించి చదివించాలంటే బోలెడు ఖర్చు. హాస్టల్, ట్యూషన్ అన్నీ తీరా మొదలుపెట్టాక, రఘు రమ్మంటే అన్నీ వదిలి పరుగెడుతుంది. ఇదంతా అనవసరమైన ఖర్చు అని.
ఖర్చు అని దాని చదువు ఆపేస్తే ఎలా? అయినా అదీ ఏదో ఒకటి చెయ్యాలి కదా! అన్నాడు అన్నయ్య.
‘‘అయితే మాత్రం.. అతని దోవన అతను అమెరికాలో కూచున్నాడు. అంత గొప్పింటి వారు దాని అత్తవారు ఏ బాధ్యతా తీసుకోకపోవడమేమిటి’’ అన్నాడు చిరాగ్గా!
-ఇంకాఉంది

- రమాదేవి చెరుకూరి